కామెడీనే ఆస్తి: ‘గట్ట కుస్తీ 2’OTT మూవి రివ్యూ
Rating : 2.75/5
ఇంట్లో ఏదైనా తేడా జరిగితే… ముందు అనుమానం మొగుడి మీదే పడుతుంది. అయితే ఈసారి ఏకంగా ఓ భర్తపై ఏకంగా తన కెరీర్ ని నాశనం చేసాడనే నింద పడింది. దాంతో అతను తన నిర్దోషిత్వంతో పాటు తన కుటుంబాన్నీ ఎలా కాపాడుకున్నాడనేది ఈ కథ.
మంచివాడు..భార్యకు సాయిం చేసేవాడు..ఆమె కెరీరే తన జీవితం అనుకున్న ఓ సగటు విశాల హృదయుడైన భర్త వీర (విష్ణు విశాల్). అతను ఈ సినిమా పార్ట్ 1 (మట్టి కుస్తీ)లో తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి)కి రెజ్లింగ్ ఛాంపియన్ చేస్తానని మాట ఇచ్చి ఉంటాడు. ప్రపంచంలో ఎవరికి మాట ఇచ్చి నిలబెట్టకోకపోయినా మునిగిదేం ఉండదు కానీ… భార్యకు ఇచ్చిన ప్రక్కన పెట్టేస్తే తనని ప్రక్కన పెట్టేస్తుందని అర్దం చేసుకున్న వాడై..దానిని సీక్వెల్ కు వచ్చేసరికి నెరవేర్చేస్తాడు.
ఇప్పుడా భార్య కేవలం రెజ్లింగ్ ఛాంపియన్ మాత్రమే కాదు రైల్వే ఎంప్లాయి కూడా.ఆమె ఓ ప్రక్క జాబ్, మరో ప్రక్క కుస్తీకు కోచింగ్ తీసుకుంటూ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే పనుల్లో బిజిగా ఉంటుంది. ఈ జంటకు మలర్ (జారా) అనే అల్లరి కూతురు.
మరి సదరు భర్త వీరాగారు ఏం చేస్తున్నాడు అంటే. అతను మిస్టర్ పెళ్లాంలో రాజేంద్రప్రసాద్ టైప్. ఇంట్లో వంట,వార్పూ చూస్తూ,పిల్లను స్కూల్ కు రెడీ చేసి, అక్కడ దింపటం, ప్రక్కింటి, ఎదిరింటి ఆడాళ్ళలో కబుర్లతో కాలక్షేపం.ఇదీ బాగానే ఉంది కదా. అయితే మనుష్యులు ఆనందంగా, ఏ గొడవా లేకుండా ఉండటం ఏ కధా రచయితకు ఇష్టం ఉండదు కదా. విలన్ పాత్ర ఎంట్రీ ఇప్పిస్తాడు. అతని భార్య కోచ్ (తారక్ పొన్నప్ప) రూపంలో.
పాపం కోచ్ మనిషి మంచోడే. కాకపోతే చిన్న అసూయ. తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న కీర్తికి వచ్చినంత పేరు తనకు రావటం లేదనే బాధ అతన్ని నిద్ర లేకుండా చేసేస్తూంటుంది.అగ్నికి ఆజ్యంలా అతని భార్య కూడా నువ్వు ఇంతే..నీ బ్రతకు ఇంతే.. కోచ్ గా గుర్తింపు లేని బ్రతకు నీది అని దెప్పుతూంటుంది.దాంతో రగిలిపోయిన సదరు కోచ్ ఓ రెండు పెగ్గులేసి, ఓ సుమూహ్తార్తాన కీర్తి కెరీర్ నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు.
అతని ప్లాన్ ఏదో అతను ఏడిస్తే బాగానే ఉండేది. ఆ ప్లాన్ కి ఆమె భర్త వీరానే పావుగా వాడుకుంటాడు.నమ్మించి దెబ్బ కొడ్తాడు. దాంతో కీర్తి నేషనల్ స్దాయిలో పాల్గొనే అర్హత కోల్పోతుంది.
ఇంకేముంది…తన కెరీర్ ని నాశనం చేసిందెవరు అని ఆమె కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా భర్త కనపడతాడు. వెనక ఉన్న కోచ్ గురించి ఆమెకు తెలియదు కదా. తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. దాంతో భర్తని బలిచేసేస్తుంది. విడాకులు కోర్టుకు ఎక్కేస్తుంది. అప్పుడా భర్త తాను నిర్దోషిని అని నిరూపించుకుని, అసలు విలన్ ని ఎలా బయిటపెట్టి,తన సంసారాన్ని, తన హౌస్ హజ్బెండ్ పోస్ట్ ని ఎలా కాపాడుకున్నాడు అనేదే తెరపై చూడాల్సిన కథ.
విశ్లేషణ
గమనిస్తే ఈ సినిమా పార్ట్ 1 లో హీరోకు ఒక Internal Arc ఉంది. “మగాడే ఇంటికి పెద్ద” అనే భావజాలంతో పెరిగిన వ్యక్తి, చివరికి “భార్య కల కూడా తన కలే” అని అర్థం చేసుకుని ముందుకు వెళ్తాడు . అంటే… అక్కడ Conflict = Ideology. ఆ పార్ట్ లో విలన్ బయట ఉండడు. విలన్ హీరోలోనే ఉంటాడు. అందుకే క్లైమాక్స్‌లో అతని మార్పు ప్రేక్షకుడికి సంతృప్తి ఇస్తుంది.
సెకండ్ పార్ట్ లో ఒక కోచ్ అసూయతో కుట్ర చేస్తాడు. ఆ కుట్రలో అమాయకంగా భర్త చిక్కుకుంటాడు. భార్య అతడే కారణమని భావించి విడాకులు కోరుతుంది. ఇది Emotional గా పనిచేసే Conflict.
అయితే సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒకటే డౌట్ వస్తుంది. వీరా అంత అమాయకంగా వెళ్లి విలన్ చేతిలో పావుగా ఎలా మారాడు. అతనేమీ తింగరోడు కాదే. మొదటి పార్ట్ లో ఉన్న వీరా ఇలా ఉండడే అనిపిస్తుంది. దాంతో ఈ కాంప్లిక్ట్ వీక్ గా అనిపించింది. వాస్తవానికి మొదటి పార్ట్ లాగనే Conflict Character నుంచి వస్తే ఫెరఫెక్ట్ గా ఉండేది. ఇక్కడ Conflict…అతని పాత్రలోంచి రాలేదు. రచయిత కథ ముందుకు వెళ్లాలని రాసాడు.
అలాగే మొదటి పార్ట్ లో వీరకు చదువు తక్కువ. కానీ Common Sense ఎక్కువ.రెండో సినిమాలో…ఆ Common Sense తీసేసి Innocence పెట్టేశారు.సాధారణంగా అమాయికుడైన హీరో ఉంటే అతను సినిమా ముందుకు వెళ్లే క్రమంలో తెలివైనవాడు అవుతాడు.అవ్వాలి. అలాంటిది ఓ తెలివైన వాడు ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం ,భార్యను ప్రేమిస్త మాత్రం అమాయికుడు అవ్వటం ఏంటి. ఎంత కామెడీ అయితే మాత్రం.
మరి సినిమా హిట్టైందే
అదే ఈ సినిమా విషయంలో ఇంట్రస్టింగ్ విషయం. చాలా మంది స్క్రీన్‌ప్లేను విమర్శించినా, ప్రేక్షకుల్లో మాత్రం సినిమా హిట్ అయింది.50 కోట్లు దాకా వసూలు చేసింది. అంటే స్క్రీన్‌ప్లేలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, వాటిని కవర్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ బలంగా పనిచేశాయి.ఈ సినిమాలో…ప్రేక్షకుడు…Coach కోసం సినిమా చూడడు. National Championship కోసం కూడా కాదు.
ఈ సినిమాని వీర-కీర్తి రిలేషన్ షిప్ కోసం చూస్తాడు. వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారా? అదే క్యూరియాసిటీ. అందుకే… Conflict Weak అయినా…Relationship Strong కావడంతో సినిమా నిలబడింది. అలాగే తండ్రి-కూతురు మధ్య వచ్చే సీన్స్ బాగా పండాయి. క్లైమాక్స్ లో కూతురు.. (పాప) కోర్టులో మాట్లాడే సీన్స్…సినిమాకు గుండెకాయి.అక్కడే మనం కనెక్ట్ అయ్యాం.క్లైమాక్స్ లో కోర్ట్ రూమ్ ని Entertainment Zoneగా మార్చటం కలిసొచ్చిన అంశం.
ఇక్కడ డేవిడ్ బోర్డ్వెల్ (David Bordwell) వంటి ప్రముఖలు చెప్పే ఓ మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. “Popular cinema survives on emotional rhythm, not perfect logic.”
ఫైనల్ థాట్..
నాకు ఈ సినిమా చూస్తూంటే పాత కాలం శోభన్ బాబు,కృష్ణ సూపర్ హిట్ సినిమాలు గుర్తు వచ్చాయి.భార్య,భర్త విడిపోవటం, పిల్లలు కలపటం వంటి ఈ డ్రామాలు ఎన్నేళ్లైనా ఫ్యామిలీలకు నచ్చుతూనే ఉంటాయనిపించింది.
ఎక్కడ చూడవచ్చు
నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది








