ప్రెగ్నెన్సీ గ్లో తో వెలిగిపోతున్న సామ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కేవలం సినిమాలతోనే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్ తో కూడా అదరగొడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ను షేర్ చేసే సామ్ తాజాగా మస్టర్డ్ ఎల్లో కేప్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపించింది. మిడీ టు మ్యాక్సీ ఈ డ్రెస్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, డ్రెస్ కు సూటయ్యే టర్కోయిస్ కమ్మలు ఎంతో హైలైట్ అయ్యాయి. ఈ డ్రెస్ లో బేబీ బంప్ తో సమంత ఎంతో అందంగా, మరింత గ్లో తో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు సామ్ లో ప్రెగ్నెన్సీ గ్లో బాగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








