బాల్టిమోర్ ఆటా మహాసభల్లో ఘనంగా సాహిత్య వేడుకలు..
అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు , యూత్ కన్వెన్షన్లో భాగంగా, ఆగస్టు 1న నిర్వహించిన సాహిత్య కమిటీ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సాహిత్య అభిమానులకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా సాగాయని నిర్వాహకులు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన ఈ సాహిత్య వేడుకల్లో భాగంగా పలు కీలక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శ్రీ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో సభా ప్రారంభం, సాహిత్య కార్యక్రమాలు.
శ్రీ రాజేశ్వర్ రావు టేక్మల్ స్వాగతోపన్యాసం చేశారు.
ఆటా అధ్యక్షుడు శ్రీ జయంత్ చల్లా అధ్యక్షోపన్యాసం అందించారు.
శ్రీ సూర్య నాంపల్లి చేతుల మీదుగా పుస్తకావిష్కరణలు జరిగాయి.
శ్రీ రాజ్ కుమార్ రెండు రోజుల కార్యక్రమాల హైలైట్స్ గురించి పరిచయం చేశారు.
అనంతరం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 గంటల వరకు “భాష – సాహిత్యం – సంస్కృతి (నిన్న… నేడు… రేపు)” అనే అంశంపై ప్రత్యేక చర్చా జరగనుంది. ‘గద్దర్’ అవార్డుల విజేత, రచయిత, జర్నలిస్ట్ శ్రీ జయదేవ్ రెంటాల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ పారుపల్లి కోదండ రామయ్య, శ్రీమతి రెంటాల కల్పన, శ్రీమతి సుధా కంచర్ల, శ్రీ భాను ప్రకాష్ మాగులూరి, శ్రీమతి జ్యోతి పిశుపాటి, శ్రీమతి రుక్మిణి మాధవి, శ్రీమతి లక్ష్మి గోపరాజు పాల్గొననున్నారు. శ్రోతలకు కూడా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు మంచి ప్రశ్నలు, సూచనలకు బహుమతులు అందజేయనున్నారు.








