దీక్షిత్ శెట్టి, శశి ఓదెల SLV సినిమాస్ #KJQ (కింగ్ – జాకీ – క్వీన్) నుంచి నువ్వే తోపు సాంగ్ రిలీజ్
సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ – జాకీ – క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KKకి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది
తాజాగా మేకర్స్ నువ్వే తోపు సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశారు. పూర్ణచంద్ర తేజస్వి పవర్ ఫుల్ బీట్స్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.
కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. అనిరుద్ధ శాస్త్రి వోకల్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది.
ఈ సాంగ్ లో దీక్షిత్ శెట్టి, శశి ఓదెల పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు కథపై ఆసక్తిని పెంచింది.
దర్శకుడు KK ఎమోషన్స్, సంఘర్షణలు, ఆసక్తికరమైన సన్నివేశాల కలయికతో ఈ పీరియడ్ క్రైమ్ డ్రామాను అద్భుతంగా మలిచారు.
SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో తెరక్కించారు.
ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.








