31st July 2026

_________

- Saidulu

మధ్యాహ్న భోజనంలో చేయకూడని 7 తప్పులు

మధ్యాహ్నం 2-3 గంటల తర్వాత తింటే జీర్ణక్రియ మందగించి కొవ్వు పెరుగుతుంది. మధ్యాహ్నం 12:30 నుండి 1:30 మధ్య తినడం శ్రేయస్కరం.

మరీ ఆలస్యంగా తినడం

టీవీ లేదా ఫోన్ చూస్తూ తింటే మైండ్ ఎంత తింటున్నామో గుర్తించదు. దీనివల్ల అతిగా తిని, బరువు పెరిగే ప్రమాదం ఉంది.

స్క్రీన్ చూస్తూ తినడం

తిన్న వెంటనే ఐస్ వాటర్ లేదా కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణ రసాల వేగం తగ్గి జీర్ణక్రియ ఆగిపోతుంది. గోరువెచ్చని నీరే మేలు. 

తిన్న వెంటనే చల్లని నీరు తాగడం

కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా పప్పు, గుడ్లు, పనీర్ లేదా పెరుగు వంటి ప్రోటీన్ పదార్థాలు ప్లేట్‌లో తప్పక ఉండాలి.

ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం

కడుపు నిండా ముక్కల వరకు తినకూడదు. 80% ఆహారంతో, 20% ఖాళీగా ఉంచితే జీర్ణక్రియ శీఘ్రంగా మరియు తేలికగా జరుగుతుంది.

పొట్ట నిండా అతిగా తినడం

తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ సమస్యలు వస్తాయి. తిన్నాక కనీసం 10-15 నిమిషాలు తేలికగా నడవాలి. 

తిన్న వెంటనే నిద్రపోవడం

భోజనం చేశాక వెంటనే పండ్లు తింటే కడుపులో పులిసిపోయి గ్యాస్, ఉబ్బరం వస్తాయి. పండ్లను స్నాక్స్ టైమ్‌లో తినండి.

తిన్న వెంటనే పండ్లు తినడం

మీ ప్లేట్‌లో సగం సలాడ్/కూరగాయలు, పావు భాగం ప్రోటీన్, పావు భాగం ధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

సరైన ప్లేట్ అలవాటు

ఆహారాన్ని ప్రశాంతంగా నమిలి తింటే రోజంతా నిద్రమత్తు లేకుండా ఉత్సాహంగా ఉంటారు. ఈ చిన్న మార్పులతో హెల్తీగా ఉండండి!