ఎమోషనల్: ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ రివ్యూ – నో వే హోమ్‌ను మించేసిందా?
Rating: 3.5/5
— సూర్య ప్రకాష్ జోశ్యుల
స్పైడీ బాబు (టామ్ హాలెండ్) ఎప్పటిలాగే ప్రపంచాన్ని దుష్టులు, దుష్ట శక్తులు నుంచి రక్షించే పనిలో బిజిగా ఉంటాడు. అయితే అతన్ని ఓ మానసిక వేదన పీల్చేస్తూంటుంది. అది అతనే పీటర్ పార్కర్ అనే విషయం అతని స్నేహితులు, లవర్ కూడా పూర్తిగా మర్చిపోవటమే. అందుకు కారణం ఇంతకు ముందు పార్ట్ లో డాక్టర్ స్ట్రేంజ్ తో కలిసి స్పైడర్ మ్యాన్ చేసిన ఓ పని . దాంతో ఆ బాధని దిగమింగుకుని నేను ఒంటరిని అని పాడుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూంటాడు
అయితే తన క్లోజ్ ఫ్రెండ్ నెడ్ ని కలిసినప్పుడు, తన మాజీ లవర్ ఎంజే …వేరే బోయ్ ప్రెండ్ తో తిరుగుతున్నప్పుుడు ఆ బాధ తిరిగి వస్తూంటుంది.దాని ఫలితంగా డిప్రెషన్ లోకి వెళ్తూంటే ..ఆ ఇంపాక్ట్ అతని పవర్స్ పై కూడా పడి ఇబ్బంది పెడుతూంటుంది.
స్పైడర్ యూనివర్స్ రూల్ ప్రకారం తను ప్రపంచాన్ని రక్షించాలి కానీ తనను తాను ఏమీ చేసుకోలేడు కాబట్టి..అలా కానిచ్చేస్తుంటాడు. జీతం భత్యం లేని తన జాబ్ నే జీవితం అనుకుని లాగేస్తూంటాడు. న్యూయార్క్ నగరాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుతూ, దాని రక్షణే జీవితాశయం అన్నట్లు బ్రతుకుతూంటాడు. అలా వర్క్ మీద బీబత్సమైన కాన్సర్టేషన్ పెరగటంతో అతనికి ‘ఫ్రెండ్లీ నెయిబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్’ అనే పేరు కూడా వచ్చేస్తుంది.
ఇలా జనాలను కాపాడుతూ, తన రూపం కూడా ఎవరికీ తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న స్పైడర్ మ్యాన్ కు ఎంతకాలం ఒంటెద్దులా పోరాడగలడు. బోర్ కొట్టేస్తుంది కదా. అతనికి సరైన శత్రువు తగలాలి కదా. అదే కదా స్పైడీ రూల్. దాని ప్రకారం ..అతనికి ఓ కొత్త శత్రువు తగులుకుంటుంది.
ఈ సారి శత్రువు ..ఓ అదృశ్య శక్తి. అది మనుష్యుల మెదుడుల్లోకి దూరి వారిని కంట్రోలు చేయగలుగుతుంది. కానీ స్పైడీ బాబు శక్తి ముందు అది బలాదూరే. ఇక ఆ అదృశ్య శక్తి టార్గెట్.. సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DODC). దానిపై మెరుపు దాడులు చేస్తుంది. ఆ శక్తి లక్ష్యం ఒక్కటే…DODCలోకి వెళ్లి అత్యంత రహస్యమైన ‘వి-మ్యాక్స్’ అనే వస్తువును చేజిక్కించుకోవడం.
ఆ అదృశ్య శక్తి గురించి DODC ద్వారా స్పైడి బాబుకి తెలిస్తుంది. అంతే టార్గెట్ ఫిక్స్. ఈ సారి ఆ అదృశ్య శక్తిని ఆధీనంలోకి తెచ్చుకుని DODC ని సేవ్ చేయాలనుకుంటాడు.నడుము బిగించి,గాల్లోకి ఎగురుతాడు. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు..స్పైడి బాబు కన్నా రెండాకులు ఎక్కువే చదివిన ఆ శక్తి …మనోడికి ఎలా లొంగింది, ఈ కథలోకి హల్క్ ఎలా వచ్చాడు.ఫనిషర్ కు ఈ కథలో పనేంటి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో మొదటి పది నిమిషాల్లోనే విలన్‌ను పరిచయం చేస్తారు. ప్రమాదాన్ని చూపిస్తారు. హీరో దాన్ని ఆపేందుకు బయల్దేరుతాడు. కానీ ఇక్కడ రచయితలు ఆ దారిలో వెళ్లలేదు. మొదటి యాక్ట్ మొత్తం పీటర్ మానసిక స్థితి మీదే నడుస్తుంది. ప్రతిరోజూ న్యూయార్క్ లో నేరాలను అడ్డుకుంటున్నాడు. ప్రజలు స్పైడర్‌మ్యాన్‌ను ప్రేమిస్తున్నారు. కానీ… అతన్ని “పీటర్” అని పిలిచే ఒక్క మనిషి కూడా లేడు. ఇది చాలా అరుదుగా కనిపించే Conflict.
ప్రపంచాన్ని కాపాడిన హీరో… తన జీవితాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఈ ఒక ఐడియా మీదే మొదటి యాక్ట్ పూర్తిగా నిలబడుతుంది.ఓ రకంగా సినిమానే నిలబెట్టేసారు. ఈ సారి స్టోరీ లైన్…”స్పైడర్‌మ్యాన్ ఎవరితో పోరాడాడు?” కాదు. “ప్రపంచం మొత్తం తనను మర్చిపోయిన తర్వాత పీటర్ పార్కర్ ఎలా బతికాడు?” అనేదే.అదే ఈ స్క్రీన్‌ప్లేలోని అతిపెద్ద బలం. అదే సమయంలో దాని అతిపెద్ద బలహీనత కూడా.
సెకండ్ యాక్ట్‌లో స్క్రీన్‌ప్లే దారి తప్పుతుంది. ఇక్కడి వరకు సినిమా పూర్తిగా పీటర్ కథ. అక్కడి నుంచి మాత్రం MCU కథ మొదలవుతుంది. DODC…వి-మ్యాక్స్… అదృశ్య శక్తి… హల్క్…పనిషర్… ది హ్యాండ్…కొత్త మ్యూటెంట్లు…ఇలా ఒక్కొక్కటిగా పాత్రలు వస్తుంటాయి. సమస్య ఏంటంటే… వీళ్లంతా కథలో ఉన్నారు. కానీ కథ మాత్రం పీటర్‌ది. దీంతో స్క్రీన్‌ప్లే ఒక్కసారిగా రెండు దారుల్లో పరిగెత్తడం మొదలుపెడుతుంది. ఒకటి పీటర్ ఎమోషనల్ జర్నీ. మరొకటి MCU ఫ్యూచర్ సెటప్.ఈ రెండింటి మధ్య స్క్రీన్‌ప్లే కొంత తూలుతుంది.
ఇక హల్క్ ఎంట్రీ థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తుంది. మొదట కనిపించినప్పుడు “ఇక అసలు కథ మొదలవుతుంది” అనిపిస్తుంది. కానీ సినిమా ముగిసే సరికి… హల్క్ లేకపోయినా కథలో పెద్ద మార్పు ఉండేది కాదు. అతను కథను మార్చడు.అయితే Punisherకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదు. కానీ ప్రతి సీన్ లోనూ అతనికి Purpose ఉంది. అతను లేకపోతే కథ లేదు అనిపించేలా. అందుకే హల్క్ కంటే Punisher ఎక్కువ గుర్తుంటాడు.
క్లైమాక్స్‌కు దగ్గరగా రచయితలు ఒక ఆసక్తికరమైన Parallel తీసుకొస్తారు. విలన్ కూడా తన వాళ్లను కోల్పోయాడు. పీటర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఒకడు బాధను అంగీకరించాడు. మరొకరు బాధను ఆయుధంగా మార్చుకున్నాడు. ఇదే నిజమైన Spider-Man Theme.
సినిమా చివర్లో ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకునేది Fight కాదు. నెడ్తో Handshake. ఎందుకు? మొత్తం సినిమా అంతా పీటర్ ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. “నన్ను ఎవరైనా మళ్లీ గుర్తుపడతారా?” అని. దానికి సమాధానం చివరి రెండు నిమిషాల్లో వస్తుంది. అది Love వల్ల కాదు. Magic వల్ల కాదు. Friendship వల్ల. ఈ Emotional Payoff స్క్రీన్‌ప్లేలో అద్బుతమైన భాగం.
ఫైనల్ థాట్
జనం ఈ సినిమాకు కేవలం ఒక సూపర్ హీరోను చూడటానికి రావటం లేదు… తమ కళ్ల ముందే ఎదిగిన పీటర్ పార్కర్‌ను మరోసారి చూడటానికి వస్తున్నారు. టామ్ హాలెండ్ తన కెరీర్లోనే అత్యంత పరిణతి చెందిన నటనతో ఆ పాత్రకు మరింత డెప్త్ తీసుకురావడం, చివరికి యాక్షన్ కంటే ఎమోషన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతోంది.








