ఆటా మహాసభల్లో ‘అల్లురి సీతా రామరాజు’ బుర్రకథ
అమెరికా తెలుగు సంఘం (ఆటా) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 19వమహాసభలను పురస్కరించుకుని తెలుగు వైభవాన్ని, సంస్కృతీ, సంప్రదాయాలు తెలియజేసేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని, అలాగే మరుగునపడిన మన కళలను ఆదుకునేందుకు వీలుగా మహాసభల్లో బుర్రకథను ఏర్పాటు చేసినట్లు ఆటా మహాసభల మీడియా చైర్ భాను స్వర్గం తెలిపారు. విప్లవ వీరుడు అల్లురి సీతా రామరాజు జీవిత చరిత్ర ఆధారంగా “బుర్రకథ బృందగానం” సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన “తెలుగు వీరగ్రంథాల నాదం…” అనే ఇతివృత్తంతో కళాభిమానులను అలరించనుంది. పద్మశ్రీ గ్రహీత శ్రీమతి శ్రీదేవి యాదపల్లి, శ్రీ నందకిషోర్ యాదపల్లి మరియు శ్రీ విజయ్ కుమార్ యాదపల్లి బృందం ఈ విశేషమైన బుర్రకథ కార్యక్రమాన్ని సమర్పించనున్నారు.







