నందమూరి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. తేజస్విని టాలీవుడ్ ఎంట్రీ?
నందమూరి కుటుంబం నుంచి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే టాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం ఫిలింనగర్లో జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు తెరవెనుక తన ప్రతిభను చాటుకున్న తేజస్విని, ఇప్పుడు నేరుగా కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా, కథా చర్చలు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా, మంచి సందేశాన్ని అందించే స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవల తేజస్విని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన డాన్స్ స్టెప్స్ వైరల్ అయ్యాయి. వాట్ ఏ పవర్ అన్నట్లు స్టెప్స్ వేసి ఆకట్టుకుంది.
Insta Link for Tejaswini Dance
https://www.instagram.com/p/








