ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా సిఎఎ పిక్నిక్ 2026
చికాగో ఆంధ్ర సంఘం (సిఎఎ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సిఎఎ పిక్నిక్ 2026 వేడుకలు అహ్లాదకరవాతావరణంలో అద్భుతంగా జరిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలు, ఆత్మీయ మిత్రుల కలయికతో సాగిన ఈ కార్యక్రమం వచ్చినవారందరికీ మరపురాని కార్యక్రమంగా కనిపించింది. ఈ వేడుకలో ‘టాలీవుడ్ లాంజ’ అందించిన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యక్షంగా తయారుచేసిన లైవ్ గ్రిల్స్, వేడివేడి బజ్జీల నుండి అరటి ఆకుల్లో వడ్డించిన సాంప్రదాయ వన భోజనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే సాయంత్రం అందించిన వేడి ఇరానీ ఛాయ్, పకోడీ, చల్లని ఐస్‌క్రీమ్‌తో కూడిన క్యారెట్ హల్వా ఆహూతులకు అపూర్వమైన రుచి అనుభూతిని పంచాయి. ఈ వేడుక విజయవంతం కావడానికి నిరంతరం సహకరించిన సిఎఎ బోర్డ్ పెద్దలకు, ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు, సభ్యులకు, స్పాన్సర్లకు మరియు శ్రేయోభిలాషులకు అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.
రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను యువ బిఓడీలు, యువ వాలంటీర్లు శ్రీయ కొంచాడ, అర్జున్ రెడ్డి ఒగ్గు, సమన్వి తాడేపల్లి, నిధి గాలి, ప్రవస్తి మండలతో పాటు పెద్దలైన ప్రియ మాటుకుమల్లి, ప్రశాంతి తాడేపల్లి తదితరులు వచ్చినవారిని స్వాగతించారు. ఫుడ్ కు సంబంధించి సురేష్ ఇనాపుడి, డిజిటల్ లీడ్ మురళి రెడ్డివారి టాలీవుడ్ లాంజ్‌తో కలిసి మెనూను సమర్థవంతంగా సమన్వయం చేశారు. సీనియర్లు సుగుణ ఆంటీ, ఇతర పెద్దలు, అనేకమంది వాలంటీర్లు వచ్చినవారికి ఆప్యాయంగా వడ్డించారు. నారాయణ మేడెంపూడి, శ్రీని పడాల కూడా ఈ కార్యక్రమానికి తమ సహకారాలను అందించారు. ధర్మేంద్ర గాలి నేతృత్వంలో ఏర్పాట్లను చేశారు. సౌండ్, టెంట్ మరియు వేదిక ఏర్పాట్లను నరసింహారెడ్డి ఒగ్గు చక్కగా చేశారు. సుభాష్ చాపలమడుగు, శైలజ సప్ప, స్మిత నండూరి నేతృత్వంలో స్పూన్ అండ్ లెమన్ రేస్, హూలా హూప్స్ వంటి కుటుంబ ఆటలతో పాటు వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. సురేష్ మహాలి ఆధ్వర్యంలో వ అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చారు. ప్రభాకర్ మల్లెంపల్లి ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఫాదర్స్ డే వేడుకలు
సరికా రెడ్డిశెట్టి రూపొందించిన ప్రత్యేక రీల్ ద్వారా పిల్లలు తమ తండ్రులకు పాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఫాదర్స్ డే వేడుకలను జరుపుకున్నారు.
సిమోనా రాచపల్లి ఆధ్వర్యంలో సిపిఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సునీత రాచపల్లి, ఉమా కొత్తమాసు కుటుంబాలన్నింటికీ పవిత్రమైన ‘ద్రోణపుష్పి’ మొక్కలను పంపిణీ చేశారు. శైలేష్ మద్ది, హరిణి మేడ నిర్వహించిన ‘బింగో’ గేమ్‌లో పెద్దలు, పిల్లలు సరదాగా పాల్గొన్నారు. సునీత ఆర్, నరసింహ ఒగ్గు పర్యవేక్షణలో యువ వాలంటీర్లు జై అనికేత్, జై అభి, సంసిత, ఆరాధ్య, కుషిర, మన్విత్, తేజ్, ధీరజ్, గీతిక, సమన్వి, అభిరామ్, లోహిత పిక్నిక్ ప్రాంతాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
శ్రీకో బ్యాటరీస్ (కొండలరావు గారు), శ్రీని వొరుగంటి గారు, టాలీవుడ్ లాంజ్ (శ్రీహరి గారు), ఆదిబాబు గారు, చైతన్య గారు, తనిష్క్ (క్రిషా దలాల్), ఇండియాకో (చింతన్ పటేల్), క్రాసన్ కన్సల్టింగ్, చార్లెస్ రూటెన్‌బర్గ్ రియల్టీ, PవీSI, ఇ-అలయన్స్, IచీG రూఫింగ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంతరం సలహాలు అందించిన రమ్య మైనేని, రామారావు కొత్తమాసు, సాహితీ కొత్త, స్వర్ణ నాగిరెడ్డి, కిరణ్ వంకాయలపాటి, శృతి కూచంపూడి, ధివిజ చల్లా, జిష్ణు వీరపనేని, రామకృష్ణ గారు, శ్రీకృష్ణ గారితో పాటు చైర్మన్ రాఘవ్ గారికి, ట్రస్టీలకు (శ్రీనివాస్ పెదమల్లు, మల్లేశ్వరి, ఉమా కటికి, పద్మారావు అప్పలనేని, దినకర్ కరుమూరి, పవిత్ర) సిఎఎ కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది.








