కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ “లవ్ జాతర”
అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్ లో “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా “లవ్ జాతర”. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా “లవ్ జాతర” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు బ్యూటిఫుల్ హీరోయిన్ మానస చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ “లవ్ జాతర” సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. మానస చౌదరి ఈ చిత్రంలో శ్రద్ధ పగడాల అనే అందమైన అమ్మాయి క్యారెక్టర్ లో ప్రేక్షకులు అలరించబోతోంది. ట్రెడిషనల్ వేర్ లో వర్షంలో సంతోషంగా డాన్స్ చేస్తున్న స్టిల్ తో రూపొందించిన మానస చౌదరి బర్త్ డే పోస్టర్ ఆకట్టుకుంటోంది.
“లవ్ జాతర” చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు.








