ఎర్రబస్సులు కాదు .. ఎయిర్ బస్లు తిరిగే ప్రాంతమైంది : రామ్మోహన్ నాయుడు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని (Bhogapuram Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఎర్రబస్సులు కాదు, ఎయిర్ బస్లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలా ఉంది. ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎర్రబస్సులు తిరిగే ప్రాంతమని కొందరు హేళన చేశారు. ఇవాళ కళ్లు తెరిచి చూడండి. ఎయిర్ బస్సు తిరిగే ప్రాంతంగా మారింది. ఎక్కడా జరగని అభివృద్ధి ఉత్తరాంధ్రలో జరుగుతోంది. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మోదీ. సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో విజన్ 2047, ప్రధాని మోదీ సారథ్యంలో వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.








