వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి లోకేష్ హెచ్చరిక
చట్టాన్ని అతిక్రమించి మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ(SI) పై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను అవమానించడం, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డిఎన్ఏ ( DNA)లోనే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ (Jagan) రెడ్డిదైతే, సమ్పుాంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.








