మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు చుక్కెదురు
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju)కు చుక్కెదురైంది. సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పలరాజు కుమారుడు ఆరవ్వర్మ (Aarav Varma) బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య (Danayya) మృతి చెందాడు. ఈ కేసులో కుమారుడిని రక్షించేందుకు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అప్పలరాజుపై అభియోగాలు వచ్చాయి. దీంతో ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలు (Ampolu Jail) కు తరలించారు.








