అమెరికా తరహాలో తెలంగాణలోనూ : మంత్రి జూపల్లి
అమెరికా తరహాలో తెలంగాణలోనై వైన్ టూరిజానికి అవకాశం ఉందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి (Manohar Reddy), తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (Yennam Srinivas Redd) తో కలిసి మంత్రి అమెరికా (America) పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా వర్జీనియాలోని అష్బర్న్లో వైనరీ పరిశ్రమను వారు సందర్శించారు. తయారీ విధానం ప్రాసెసింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ఈసందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అనువైన ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ భూమివిస్తీర్ణం, పెట్టుబడి అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు.








