భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ప్రధాని వెంట గవర్నర్ జస్టిస్ నజీర్ (Justice Nazir), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan), నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు మురళీధర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.మల్లిఖార్జనరావు, జీఎం ఆర్(GMR|) గ్రూపు బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్నినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్నినల్ సందర్శనలో భాగంగా చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు.








