పవన్‌కల్యాణ్‌తో మంత్రి రామానాయుడు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) భేటీ అయ్యారు. సూపర్ ఎల్‌నినో (El Nino) పరిస్థితులపై చర్చించారు. సూపర్ ఎల్‌నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలన్నారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని అన్నారు. ఏలేరు ప్రాజెక్టు ( Yeleru Project) నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు నిమ్మలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను నిమ్మల రామానాయుడు పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.








