వైసీపీ నేత అంబటి రాంబాబుకు షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పై సీఐడీ పోలీసులు (CID police) కేసు నమోదు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar)ను కించపరిచేలా వీడియోను సోషల్ మీడియాలో అంబటి పోస్ట్ చేశారు. పెమ్మసాని చేతికి సంకెళ్లు వేసినట్లు ఏఐ వీడియోను ఆయన రూపొందించారు. దీనిపై డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేత మద్దిరాల మ్యానీ (Maddirala Manny) ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదైంది.








