ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్
అమరావతి: ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ లు స్వాగతం పలికారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ కు పుష్పగుచ్చం అందించి మంత్రి సాదర స్వాగతం పలికారు. రాష్ట్రానికి విచ్చేసిన జూలియన్ హిల్ ను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. శనివారం మంత్రి నారా లోకేష్ సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, రాష్ట్ర విద్యాశాఖ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.








