ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు : మంత్రి నిమ్మల రామానాయుడు
జగన్ పాలనలో పోలవరం (Polavaram Project) ప్రాజెక్టు నిర్వీర్యమైందని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎడమ కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందితే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) కుమారుడిని కాపాడుకుందామని అనేక తప్పులు చేశారు. నిందితుడిని కాపాడుతూ జగన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ విషయంలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన అయినా జగన్‌కి హితవు చెప్పాలి. అప్పలరాజుకు పరామర్శ పేరుతో బలప్రదర్శన నిర్వహించారు. మహిళా ఎస్సైపై వైసీపీ నేతల దాడి హేయమైన చర్య. జైలు వద్ద జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దానయ్య కుటుంబానికి ఆయన క్షమాపణ చెప్పాలి. భోగాపురం విమానాశ్రయాన్ని (Bhogapuram Airport) జగన్ వ్యతిరేకించారు. ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. మోదీ చంద్రబాబు సారథ్యంలో ఎయిర్‌పోర్టు సిద్ధమైంది అని అన్నారు.








