తెలంగాణ లో మరోసారి సర్ పొడిగింపు
తెలంగాణ ( Telangana)లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) (sir) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు (Enumeration Forms) సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ గడువు జులై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు.








