ఆటా మహాసభల్లో హరనాథ్ పులిచెర్లకు ఘన సన్మానం
మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపించినవారికి అవార్డులను అందజేశారు. కమÖ్యనిటీ ప్రముఖులను కూడా సత్కరించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, నాయకత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ మహాసభల్లో, ప్రముఖ నాయకుడు, డాక్టర్, నిర్మాత, హీరో హరనాథ్ పులిచెర్లను కూడా ఘనంగా సత్కరించడంతోపాటు మెమోంటోనూ కూడా అందజేశారు. అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.








