భోగాపురం బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.
• సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహాస్వామి, శ్రీకూర్మం కూర్మనాధస్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారం.
• ఏపీ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజు.
• విమానాశ్రయం ప్రారంభోత్సవం సహా మొత్తంగా రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
• అభివృద్ధిలో రికార్డులు సాధించడమే కాదు… థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉంది.
• 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో రికార్డులు సృష్టించిన వారికి అభినందనలు.
• అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇది.. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన ప్రాణాలను అర్పించారు.
• అల్లూరి పేరుతో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించడం సంతోషంగా ఉంది.
• ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు ఓ రన్ వేలా, ఓ లాంచ్ ప్యాడ్ లా పని చేస్తుంది.
• గతంలో ఎయిర్ పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి… కానీ మేం వచ్చాక ఆ పద్దతిని మార్చాం.
• అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేశాం.
• భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించాం.
• అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టాం.
• గతంలో 74 ఎయిర్ పోర్టులు ఉండేవి.. కానీ ఇప్పుడు 166 ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
• ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయి.
• ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది.
• స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్ కాశీ నుంచి అమృత్ సర్ వరకు విస్తరించింది… దీని వల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారు… పంజాబ్ కు అభినందనలు


• డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండేలా ప్రజలు ఆశీర్వదించారు.
• చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ టీమ్ రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోంది.
• కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం.
• విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నాం.
• మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం.
• విశాఖ-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వే ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ రహదారులతో వేగం పెంచుతున్నాం.
• రూ. 1 లక్ష కోట్ల ఖర్చుతో రైల్వే కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి.. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాం.
• 70కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.
• పీఎం గతి శక్తి-మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి చేస్తున్నాం.
• ఆధునిక లాజిస్టిక్ నెట్ వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపయోగం ఉంటుంది.
• భవిష్యత్తును ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది.
• సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఇక్కడి యువతకు మంచి టాలెంట్ ఉంది.
• దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్ ను శంకుస్థాపన చేశాం.
• సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ రంగంలోనే కాకుండా.. మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ అభివృద్ధి జరుగుతుంది… యువతు ఉపాధి లభిస్తుంది.
• అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టంను ఏర్పాటు చేసేందుకు మేం సహకరిస్తున్నాం.
• సీఎం చంద్రబాబు రాత్రి పగలు కష్టపడి చేస్తున్న కృషి వల్లే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి.
• సెమీ కండక్టర్ పరిశ్రమతో పాటు.. ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు వస్తున్నాయి.
• గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది… అలాగే చాలా అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
• ఇవన్నీ ఏపీ యువతతోపాటు.. దేశంలోని యువతకు ఉపాధి లభించబోతోంది.
• నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది… దేశంలో ఏపీ ప్రముఖ ఫార్మా హబ్ కానుంది.
• రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
• ఏపీ అభివృద్ధి కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాత్రి-పగలు కష్టపడి డబులింజన్ సర్కార్ పని చేస్తుంది.
• ఏపీలో అభివృద్ధిలో చాలా వేగంగా పని చేస్తుంది.
• గత 3 ఏళ్ల పర్యటనల్లో నేను రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను.
• ఏపీ అభివృద్ధి యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖ ఎకనమిక్ రీజియన్ కీలకం కానుంది.
• విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆసియా ఖండంలో అతి ముఖ్యమైన కేంద్రంగా మారబోతోంది… దీనికి అన్ని రకాల చర్యలు కేంద్రం తీసుకుంటోంది.
• పెట్టుబడుల నుంచి ఉపాధి అనేది ఎన్డీఏ లక్ష్యం. ప్రభుత్వ పరంగా దీనికి చర్యలు తీసుకుంటున్నాం.
• పెట్టుబడులు పెరిగితే.. ఉత్పత్తి పెరుగుతుంది.. ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి.. ఎగుమతులు పెరిగితే ఉపాధి పెరుగుతుంది. అప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి.
• ఇవాళ ఏపీలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాయి.







