అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
• భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
• 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోదీ నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకున్నాం.
• భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం.
• ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది.
• అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు.
• అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఆకాంక్షలను అడ్డుకున్నారు.
• భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకే గర్వకారణం.
• అల్లూరి పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుంది.. ఆయన పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాం.
• ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు.
• ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు.
• ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర.
• ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ.
• విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనే.
• 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం.
• 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం.
• ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది.
• అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది.
• విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం.
• శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది… భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది.
• భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం.
• 2 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.




• వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
• 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది.
• ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం.
• వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం.
• ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి.
• ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు త్వరలోనే వస్తాయి.
• మేం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
• ఐటీ నుంచి ఏఐ వైపు ప్రపంచం వెళ్తోంది.
• ఈ దశలో లీడర్షిప్ ఇచ్చే నాయకత్వం కావాలి.
• ప్రపంచంలోని వివిధ దేశాలు సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయి.
• కానీ భారత దేశం అదృష్టం.. ప్రధాని మోదీ వంటి సమర్ధవంతమైన నాయకుడు దేశానికి లభించారు.
• 144 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేది ఒక్క మోదీనే.
• గత 12 ఏళ్లల్లో దేశాన్ని అద్భుతమైన అభివృద్ధి పధంలో నడిపించారు.
• డిజిటల్ ఇండియా కలను సాకారం చేయగలిగింది ప్రధాని మోదీ మాత్రమే.
• దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి, మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
• ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి వాటితో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
• దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి తెచ్చారు.
• ప్రధాని మోదీ నాయకత్వంలో టెర్రరిజం అంతమవుతుంది.
• నా 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ లాంటి నాయకుణ్ణి తొలిసారి చూస్తున్నాను.
• నేషన్ ఫస్ట్ అనే సింగిల్ అజెండాతోనే ప్రధాని పని చేస్తారు.
• ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ద ప్రభావాలు దేశం మీద పడుకుండా చూడడంలో ప్రధాని సఫలీకృతులయ్యారు.
• రైట్ టైమ్, రైట్ ప్లేస్ లో రైట్ మ్యాన్ నరేంద్ర మోదీ ఉన్నారు.
• నరేంద్ర మోదీకి అందరూ అండగా నిలవాలి… సంఘీభావం తెలియచేయాలి.
• నరేంద్ర మోదీకి అండగా నిలవడం మన బాధ్యత.
• ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారికి కూడా ఆయన చేసే మంచి పనులేంటో తెలుసు.
• కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిలో ముందుకెళ్దాం.
• ఉత్తరాంధ్రలో ఇక పేద అరుపులు ఉండవు… ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర.
• థింసా నృత్యంతో రికార్డులు సాధించినవారికి అభినందనలు.







