సభ సక్సెస్ పై మంత్రులు, అధికారులకు సిఎం చంద్రబాబు అభినందనలు
గుడ్ జాబ్… ఎక్స్ లెంట్ టీం వర్క్!
థింసాతో స్వాగతం నుంచి సభ వరకు అన్నీ గ్రాండ్ సక్సెస్
భోగాపురం ప్రారంభం వైభోగంగా జరిగింది! కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు.. ఓన్ చేసుకున్నారు.
అమరావతి: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం గ్రాండ్ సక్సెస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం వైభోగంగా జరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు. థింసాతో స్వాగతం నుంచి సభ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించారని సిఎం చెప్పారు. సభను విజయవంతం చేయడంలో మంత్రులు, అధికారులు ఎంతో సమన్వయంతో పని చేశారని సిఎం అభినందించారు. సభ అనంతరం విశాఖ నుంచి అమరావతి వచ్చిన ముఖ్యమంత్రి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభకు ఉత్తరాంధ్ర సమాజం నుంచి ప్రజల నుంచి వచ్చిన స్పందన తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ఒక మంచి పని చేస్తే ప్రజా స్పందన ఎలా ఉంటుంది అనేది మరో సారి నిరూపితం అయ్యిందని సిఎం అన్నారు. కార్యక్రమం ఆసాంతం ఎంతో ఉత్సాహంగా సాగిందని సిఎం చెప్పారు. బస్సుల ఏర్పాటు ద్వారా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను క్షేమంగా తీసుకువచ్చి.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేశారని సిఎం అధికారులను అభినందించారు.
కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అందిన భోజనం, రవాణా సౌకర్యంపై సంతృప్తి వ్యక్తం అవుతుందని మంత్రులు వివరించారు. ఏ పెద్ద కార్యక్రమం పెట్టుకున్నా… టీం వర్క్ లా మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు కలిసి పని చేయడం మంచి పరిణామం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో వచ్చిన స్పందన నిజంగా తనకు ఎప్పటికి గుర్తిండిపోతుందని సిఎం అన్నారు. ప్రధాని పర్యటన ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఉత్సాహంగా సాగడం, అన్ని వర్గాలు స్పందించి తమ ఇంట్లో పండుగగా భాగస్వాములు అవ్వడం గొప్పవిషయం అని సిఎం ప్రశంసించారు. సభ సక్సెస్ కావడానికి శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా కలిసి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిద్దామని సిఎం అన్నారు. టెలీకాన్ఫరెన్సులో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని సత్య ప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్, సీనియర్ అధికారులు, కృష్ణబాబు, వీరపాండ్యన్, ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ విశ్వనాధ్, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో పాటు సీఎంవో అధికారులు పాల్గొన్నారు.








