ఆటా మహా సభల్లో రసమయి బాలకిషన్, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్ అద్భుత ప్రదర్శన!
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ప్రముఖ జానపద కళాకారులు, గాయకులు రసమయి బాలకిషన్, కాసర్ల శ్యామ్ , మిట్టపల్లి సురేందర్ తమ అచ్చమైన పల్లె పాటలతో సభికులను ఉర్రూతలూగించారు.
విదేశాలలో మన మట్టి వాసనలను, తెలంగాణ జానపద సంస్కృతిని పరిచయం చేస్తూ వారు సాగించిన పాటల ప్రదర్శన ఈ మహాసభలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, మన పాటను, మన ఆటను, మన సంస్కృతిని బతికిస్తున్న ఆటా నిర్వాహక బృందానికి కళాకారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.








