లెహంగాలో చూడముచ్చటగా ఈషా రెబ్బా
తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈషా గోల్డెన్ కలర్ హ్యాండ్‌వోవెన్ లెహంగాలో మెరిసింది. ఈ అవుట్‌ఫిట్ కు సరిపోయే కుందన్ చోకర్, మ్యాచింగ్ జుంకాలు, వడ్డాణం, బ్యాంగిల్స్ ధరించి ఎంతో అందంగా కనిపించగా, ఆ ఫోటోలను చూసి నెటిజన్లు ఈషా చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








