హిట్ హీరోయిన్‌కు అవకాశాల కరువు.. రాకాపైనే మృణాల్ ఆశలు!
బాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన తర్వాత సీతారామం(Sitaramam)తో టాలీవుడ్ కు పరిచయమైన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), తక్కువ టైమ్‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తో పాటు ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు టాలీవుడ్లో మంచి అవకాశాలకు దారి తీశాయి. హాయ్ నాన్న(Hi nanna)లో ఆమె చేసిన క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఫ్యామిలీ స్టార్(Family Star) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా, మృణాల్ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలందాయి. రీసెంట్ గా డెకాయిట్(Dacoit)లో కనిపించిన ఆమె మరోసారి తన యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అయితే మృణాల్ కెరీర్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగులో మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ, కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ మాత్రం ఏమీ లేదు. మరోవైపు బాలీవుడ్ లో చేసిన రీసెంట్ సినిమాలు ఆశించిన సక్సెస్‌లను అందుకోలేకపోవడం ఆమె కెరీర్‌పై డిస్కషన్ కు కారణమైంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన మృణాల్‌కు ప్రతి పోస్ట్, ఫోటో, వీడియో వైరల్ అవుతుంటాయి. అయినప్పటికీ, ఆ క్రేజ్ కొత్త ప్రాజెక్టుల రూపంలో వెంటనే మారడం లేదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న భారీ సినిమా అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న రాకా(raaka) మాత్రమే. ఈ సినిమాలో మృణాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని తెలుగు ప్రాజెక్టుల కోసం డిస్కషన్స్ జరిగినప్పటికీ అవి ముందుకు సాగలేదని టాక్ ఉంది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో ఆమె డిమాండ్లు కూడా కొన్ని అవకాశాలపై ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా, మృణాల్ తదుపరి కెరీర్ దిశను డిసైడ్ చేసే సినిమాగా రాకా మారే అవకాశం ఉందనే అంచనాలు బలపడుతున్నాయి.








