బ్రేకప్ రూమర్లపై రియాక్ట్ అయిన అనుపమ
గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న బ్రేకప్ ప్రచారాలపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) మొదటిసారిగా రియాక్ట్ అయ్యారు. అయితే ఆమె ఎవరిపేరును ప్రస్తావించకుండా, గతేడాది తన లైఫ్ లో మానసికంగా ఎంతో కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆ టైమ్ లో తనను తాను కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పినా, పర్సనల్ లైఫ్ పై జరుగుతున్న ఊహాగానాలను మాత్రం ఆమె డైరెక్ట్ గా సమర్థించడం కానీ ఖండించడం కానీ చేయలేదు. దీంతో ఆమె కామెంట్స్ మరోసారి డిస్కషన్‌కు దారితీశాయి.
కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్(Dhruv Vijram) తో అనుపమ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బైసన్ కాలామాడన్ సినిమా టైమ్ లోనే మొదలయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి సోషల్ మీడియా కార్యకలాపాలను ఫ్యాన్స్ గమనిస్తూ పలు కథనాలు ప్రచారం చేశారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ ధృవ్‌ను అన్‌ఫాలో చేశారనే ప్రచారం, అలాగే ఆమె రీసెంట్ గా చేసిన ఎమోషనల్ పోస్టులు ఈ ఊహాగానాలను మరింత పెంచాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ సంబంధంపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు.
ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడిన అనుపమ, చాలా కాలం ఇతరుల కోసం జీవించానని, కానీ ఇప్పుడు తన కోసం డెసిషన్స్ తీసుకోవడం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తాను గతాన్ని తలుచుకుంటూ ఉండకుండా, కొత్త లైఫ్ పై దృష్టి సారించానని చెప్పారు. ప్రతి వ్యక్తిగత విషయాన్ని ప్రజల ముందుంచాల్సిన అవసరం లేదని, కొన్ని అనుభవాలు వ్యక్తిగతంగానే ఉండాలని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆమె కామెంట్స్ ను కొందరు బ్రేకప్ ప్రచారాలతో అనుసంధానిస్తుండగా, మరికొందరు అది కేవలం లైఫ్ లెస్సన్స్ గురించి చేసిన కామెంట్స్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.








