సల్మాన్ కెరీర్లోనే భారీ రెమ్యూనరేషన్ తగ్గింపు?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(salman khan) తన తర్వాతి సినిమా SVC63 కోసం రెమ్యూనరేషన్ లో గణనీయమైన తగ్గింపుకు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే సల్మాన్, ఈ సినిమాకు సుమారు రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తో ముందుకు వచ్చారని ప్రచారం సాగుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన తీసుకున్న డెసిషన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారితీసింది. రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా పొందే అవకాశం కూడా ఉందన్న ప్రచారం వినిపిస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) బాలీవుడ్లో అడుగుపెడుతున్న మొదటి సినిమా కావడంతో SVC63పై స్పెషల్ ఫోకస్ ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రల కోసం స్ట్రాంగ్ క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ముంబైలో షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్‌లు అందుకోలేకపోయిన సల్మాన్ ఖాన్‌కు ఈ సినిమా కీలకంగా మారనుంది. అదే సమయంలో నిర్మాత దిల్ రాజు(Dil Raju) కూడా హిందీ మార్కెట్లో భారీ సక్సెస్ సాధించాలని ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న చిత్రబృందం, త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.








