మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్.. ‘దంధా’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : ఛాయ్ షాట్స్
నటీనటులు : దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కే చాప్లిన్, విక్రమ్ దేవాకి తదితరులు నటించారు
సంగీతం : రిషి ఎమ్, ఛాయాగ్రహణం : అశ్విన్ లెనిన్
కూర్పు : జగదీష్ గౌడ్, కథ : విజయ్ కుమార్
కళా దర్శకత్వం : సంజన కంచాల
సహ-రచయిత, దర్శకత్వం : ఆదిత్య దేవులపల్లి
ఎపిసోడ్ నిడివి :1 ఘంట 04 నిముషాలు
29 ఎపిసోడ్స్ తో వెర్టికల్ సిరీస్
చాల కాలం నుండి ఇంగ్లీష్, చైనిస్, కొరియన్, హిందీ మొదలైన భాషలలో వెర్టికల్ సిరీస్ లు అరచేతిలో ప్రసారం అవుతున్నాయి. తెలుగు లో తొలిసారిగా ఛాయ్ షాట్స్ సంస్థ నుండి ‘దంధా’ అనే టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ వెర్టికల్ సిరీస్ విడుదల చేసారు. 29 ఎపిసోడ్స్ లతో వస్తున్నఈ వెర్టికల్ సిరీస్ ఒకో ఎపిసోడ్ 64 నిముషాలు ఉంది. యూట్యూబ్ స్టార్ గా అందరికీ తెలిసిన దొర సాయి తేజ, అక్షర నల్ల హీరో హీరోయిన్ గా ఛాయ్ షాట్స్ బ్యానర్ లో ఆదిత్య దేవులపల్లి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా వుందో సమీక్షలో చూద్దాం.
కథ :
అరవింద్ (దొర సాయి తేజ) 22 ఏళ్ల తెలివైన బి.టెక్ విద్యార్థి. డబ్బు, అధికారం సంపాదించాలనే బలమైన కోరిక అతనిది. తరగతి గదిలో కన్నా హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే తన తెలివితేటలకు అసలైన విలువ దక్కుతుందని అరవింద్ గ్రహిస్తాడు. చిన్న చిన్న ఆన్లైన్ మోసాలతో ప్రారంభమైన అతని ప్రయాణం.. ఫిషింగ్ స్కామ్‌లు, కాల్ సెంటర్లు, బ్లాక్మెయిల్లు మరియు గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వైపు ఎలా దారితీసింది? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌ను శాసించే స్థాయికి అరవింద్ ఎలా ఎదిగాడనేదే ఈ సిరీస్ కథ.
నటీ నటుల హవబవాలు :
యుట్యూబ్ లో వ్యూస్ తుఫాన్ సృష్టించే దొర సాయి తేజలోని అసలైన నటుడిని ఈ సిరీస్ బయటకు తీసింది. ఇది మామూలు నటన కాదు.. విజయం కోసం ఎంతటి అన్యాయానికైనా తెగించే ఒక రా అండ్ రఫ్ ‘యాంటీ-హీరో’గా జీవించేశాడు. ‘బిజినెస్ మేన్’ లో మహేష్ బాబు సూర్య పాత్రలోని ఆకలి, కసి సాయి తేజ కళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. నటుడిగా దొర సాయి తేజ రీ-ఇన్వెన్షన్ ఈ షోకి బిగ్గెస్ట్ అసెట్. ఒక క్యాలిక్యులేటెడ్, డెవిలిష్ యాంటీ-హీరోగా అతడు చూపించిన పరిణతి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి యంగ్ లీడ్ దొరికాడనే నమ్మకాన్ని ఇస్తుంది. కళ్లలోనే కూల్ గా క్రూరత్వం, గెలుపు కోసం తపించే ఆకలితో అద్భుతమైన నటన కనబరిచాడు. హీరోయిన్ అక్షర నల్ల లుక్స్ ఎంత నేచురల్ గా ఉన్నాయో.. పెర్ఫార్మెన్స్ కూడా అంతే నేచురల్ గా ఉంది అని చెప్పాలి. పక్కన ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా ..ఆమె తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిగతా నటీ నటులు తమ పాత్రలమేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి టేకింగ్ లో ఎక్కడా తొలి ప్రయత్నంలా అనిపించదు. కంటెంట్ ని ఎక్కడా అనవసరంగా లాగకుండా, ప్రతి సీన్ ని ఒక పాయింట్ తో ఎండ్ చేయడం ఆయన రచనా ప్రావీణ్యానికి నిదర్శనం. “బచ్చ్చా జబ్ షైతాన్ బంతా హాయ్ తోహ ఘర్ బరబాద్ హోతా హాయ్, లేకిన్ షైతాన్ జబ్ బచ్చ్చా బంతా హాయ్, తోహ పూరా షెహర్ బరబాద్ హోతా హాయ్” లాంటి సంభాషణలు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి. క్రాఫ్ట్ మీద పూర్తి గ్రిప్ ఉన్న దర్శకుడిలా ప్రతి ఎపిసోడ్ ని ముగించిన తీరు అద్భుతం. విజువల్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, దానికి తోడు మైండ్ లో నిలిచిపోయే సౌండ్ ట్రాక్.. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. దర్శకుడికి ఒక ప్రొఫెషనల్ విస్పష్టత ఉంది. జర్నలిజం నుంచి వచ్చి తొలి సినిమాతోనే తరుణ్ భాస్కర్, సందీప్ వంగాలాంటి వారిలా తనకంటూ ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించాడు. ‘పూరి జగన్నాథ్’ మార్క్ డైలాగ్స్, నటీనటుల నుంచి రా నటన రాబట్టడం జరిగింది. మెక్సికన్, టర్కిష్ ఇన్ స్ట్రుమెంట్స్ తో రిషి అందించిన మ్యూజిక్ తెలుగులో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ సౌండ్ ట్రాక్స్ లో ఒకటి. రిషి ఎం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అశ్విన్ లెనిన్ విజువల్స్ ఈ సిరీస్ కి ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
ఒక్క ఎపిసోడ్ చూసి ఆపేద్దాం అని స్టార్ట్ చేస్తే, తీరా చూసేసరికి 64 నిమిషాల సిరీస్ ఆడిపాడి పూర్తయిపోతుంది! ‘చాయ్ షాట్స్’ వేదికగా వచ్చిన ‘ధంధా’ తెలుగు మైక్రో-కంటెంట్ కేటగిరీలో ఒక సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. రెండున్నర నిమిషాల ఎపిసోడ్స్ తో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ డ్రామాను అందించడంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడు. చిన్న ఎపిసోడ్లతో కంప్లీట్ క్రైమ్ డ్రామాను నడిపించడం కత్తిమీద సాము. కానీ ఆ రిస్క్ ని అత్యంత ప్రతిభావంతంగా చేసి చూపించింది ‘ధంధా’ టీమ్. సమయం లేదని సాకులు చెప్పే రోజులు పోయాయి! జస్ట్ 64 నిమిషాల్లో ఒక గూస్ బంప్స్ ఇచ్చే మైక్రో-డ్రామా ఎలా తీయాలో ‘ధంధా’ నిరూపించింది. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే పేసింగ్ తో ‘చాయ్ షాట్స్’ గట్టిగానే కొట్టింది. తెలుగు ఓటీటీ కంటెంట్ గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం ‘ధంధా’. 64 నిమిషాల నిడివితో సాగే ఎపిసోడ్స్ మిమ్మల్ని స్క్రీన్ కు హుక్ చేసి పడేస్తాయి. ఓ సారి ట్రై చేయండి.








