3rd August 2026

_________

- Saidulu

రోజుకు ఒక స్పూన్ నువ్వులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకు ఒక స్పూన్ నువ్వులు తింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం! అవేంటో ఈ వెబ్‌స్టోరీలో చూద్దాం.

నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చి ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గిస్తాయి.

ఎముకల దృఢత్వానికి..

వీటిలోని సెసమిన్ అనే గుణం కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికి రక్షణ..

నువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

వీటిలో ఐరన్ మరియు కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహోణ సమస్యను తగ్గిస్తాయి.

రక్తహోణం నివారణకు..

నువ్వుల నూనె మరియు గింజల్లోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతాయి.

చర్మ కాంతికి సాయం..

నువ్వులలోని పోషకాలు కుదుళ్లను దృఢపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తైన కురుల సొంతం అయ్యేలా చేస్తాయి.

జుట్టు రాలడం తగ్గుతుంది..

జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. శరీరం వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.

రోగ నిరోధక శక్తి పెంపు..

స్త్రీలలో మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులను తట్టుకోవడానికి నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి.

హార్మోన్ల సమతుల్యత..

రోజుకో స్పూన్ నువ్వులను నమిలి తిన్నా, లేదా వేయించుకుని సేవించినా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది!

రోజువారీ మోతాదు..