ఆ పార్టీ నేతలకు చట్టం అంటే భయం లేదు : మంత్రి పార్థసారథి
వైసీపీ నేతలు రాష్ట్రంలో చేస్తున్న అలజడులను చూసి ప్రజలు ఛీకొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి (Parthasarathi) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి (MLA Virupakshi) వ్యవహరించిన తీరుపై మంత్రి ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ (YCP)లో నేతలు కొనసాగాలంటే అరాచకాలు చేయాలని, జగన్ (Jagan) కళ్లలో ఆనందం కోసమే ఘోరాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతలకు చట్టం అంటే భయం లేదని మండిపడ్డారు. దళితుల ఇంటిపై దాడికి పాల్పడి అరాచకం సృష్టించిన నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.








