బాల్టిమోర్ చరిత్రలో నిలిచిపోయే వేడుక ఇది: శ్రీధర్ బానాల
అమెరికాలో 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు బాల్టిమోర్ చరిత్రలో నిలిచిపోతాయని ఆటా కన్వీనర్ శ్రీధర్ బానాల అన్నారు. గత 30 సంవత్సరాలుగా తాను బాల్టిమోర్‌లో ఉంటున్నానని, ఇలాంటి అద్భుతమైన , చారిత్రక వేడుకలను బాల్టిమోర్ నగరం ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
ఈ మహాసభల విజయవంతం కోసం తనకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా తన వెన్నంటి నిలిచి అన్ని రకాలుగా మద్దతుగా ఉన్న తన సతీమణికి ధన్యవాదాలు తెలిపారు.








