రివ్యూ: ‘క్రేజీ కళ్యాణం’ ఎలా ఉందంటే?
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : యారో సినిమాస్
నటీనటులు : ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ : శ్యామ్ దూపాటి
ఎడిటర్ : శ్రావణ్ కటికనేని, కొరియోగ్రఫీ : ఈశ్వర్ పెంటి
ఆర్ట్ డైరెక్టర్ : సాయి కదిర, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : డ్రాగన్ ప్రకాష్
పాటలు: గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అఖిల్ సాయి శ్రీమూర్తి
స్క్రీన్ ప్లే : శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
నిర్మాతలు : బూసం జగన్ మెహన్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం : బద్రప్ప గాజుల
విడుదల తేది : 16.10.2026
నిడివి : 2 ఘంటల 24 నిముషాలు
డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం.(Crazy Kalyanam) ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాని నేడు అక్టోబర్ 16న ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ మూవీ కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? అన్నది చూద్దాం. సమీక్షలో చూద్దాం.
కథ:
మెదక్‌లోని ఓ గ్రామంలో కల్మషం లేని మనసుతో ఊరిలో మంచి పేరు సంపాదించుకొన్న పర్వతాలు (నరేష్)(Sr Naresh) కాస్త మంచి పేరు, గౌరవంతో జీవనం సాగిస్తుంటాడు. పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) (Tarun Bhaskar) తాగుడు, వాగుడుతో ఊర్లో పర్వతాలు పరువు తీస్తుంటాడు. ఈ క్రమంలో చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి(Anupama Parameswaran) మంచి సంబంధం తీసుకు రావాలని అనుకుంటూ ఉంటాడు. కానీ చిన్న కూతురు కీర్తి మాత్రం ఉద్యోగం సంపాదించాలి. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంటుంది. ఇంకో వైపు కీర్తికి ఉదయ్ (అఖిల్ రాజ్ఉడ్డెమారి)(Akhil Raj Uddhemari) అంటే కూడా ఇష్టమే. కానీ అమ్మానాన్నల మాటని కాదని కీర్తి ఏ పనీ చేయదు. అలాంటి కీర్తికి తండ్రి ఓ ఎన్నారై సంబంధాన్ని తీసుకు వస్తాడు. అయితే పెళ్లికి ముందు ఉదయ్‌తో లవ్ అఫైర్ గురించి చెబుతుంది. దాంతో పర్వతాలు తన కూతురు కీర్తీపై ఆగ్రహం వ్యక్తం చేసి.. తనకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకోవాలని ఆంక్షలు విధిస్తాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కీర్తి ప్లాన్ చేసుకొంటుంది. పెద్ద అల్లుడు బాలరాజు వల్ల పర్వతాలుకు ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి? పెద్ద కూతురు వైవాహిక జీవితంపై పర్వతాలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు? కీర్తికి తనకు నచ్చిన వరుడిని తీసుకు రావాలని ఎందుకు అనుకొన్నాడు? తాను తెచ్చిన సంబంధం కాకుండా లఫ్ అఫైర్ గురించి కీర్తీ చెప్పినప్పుడు పర్వతాలు రియాక్షన్ ఏమిటి? కీర్తీ లవ్ వ్యవహారాన్ని పర్వతాలు ఒప్పుకొన్నాడా? లేదా? కీర్తీకి తాను కుదిర్చిన వివాహాన్ని చేశాడా? కీర్తీ రిజిస్టర్ మ్యారేజ్ వ్యవహారంలో ఏం జరిగింది? కీర్తీ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే క్రేజీ కల్యాణం సినిమా కథ.
క్రేజీ కళ్యాణం సినిమా చూసేటప్పుడు ఇది పీరియాడిక్ సినిమానా? లేదంటే ప్రజెంట్ టైంలో జరిగే కథనా? అన్న అనుమానం వస్తుంది. ఒక్కోసారి ఇది పాత కాలం చిత్రం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు మోడ్రన్ టైంలోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అమ్మాయిల్ని ఎలా పెంచాలి.. వాళ్లకి ఆర్థిక స్వేచ్ఛ ఎంత అవసరం? పెళ్లికి పెట్టే ఖర్చులో పదో వంతు వారి చదువులకు పెట్టినా వారి జీవితం బాగు పడుతుంది.. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలి అనే సందేశాన్ని ఇవ్వాలని దర్శకుడు అనుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ సందేశం బాగానే ఉన్నా.. ఆ మెసెజ్‌ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు రాసుకున్న కథ, తీసిన విధానం సరిపోలేదనిపిస్తుంది.
నటీ నటుల హావభావాలు :
ఆర్టిస్టుల విషయానికి వస్తే అనుపమ, నరేష్ తర్వాతే ఇతర ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా మొత్తం ఈ ఇద్దరి డామినేషన్ కనిపిస్తుంది. ప్రతీ సీన్లో ఈ ఇద్దరే కనిపిస్తారు. అయితే ముఖ్యంగా అనుపమ మూవీ భారాన్నంత తన భుజాలపై మోసింది. ఫన్, లవ్, ఎమోషన్స్ ఉన్న కీర్తీ పాత్రలో ఒదిగిపోయింది. అఖిల్ రాజ్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంటర్టైనర్గా పూర్తి న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ మెప్పిస్తాడు. ఆ తర్వాత అఖిల్ రాజ్, కిరిటీ దామరాజు వంటి వారు వస్తారు. కీర్తి అక్క, నాయనమ్మ ఇలా మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు :
తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాను నడిపి ఉంటే బెటర్‌గా ఉండేది. అయితే ఫస్టాఫ్‌ను కామెడీకి పెద్ద పీట వేసి సాధాసీదాగా నడిపించిన దర్శకుడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌పై ఫోకస్ చేయడంతో ఆడియన్స్ సినిమాలో లీనమయ్యేలా చేసింది.సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కెమెరా వర్క్ నేచురల్‌గా ఉంటుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. క్యాస్టూమ్, ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ పరంగా పెద్ద ఖర్చు ఏమీ కూడా తెరపై కనిపించదు. తక్కువ బడ్జెట్లోనే సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.
విశ్లేషణ :
క్రేజీ కళ్యాణం లో మెసెజ్, చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంటుంది. కానీ హార్ట్ టచింగ్‌గా చెప్పడంలో కాస్త విఫలం అయ్యారనే చెప్పొచ్చు. చివరి 20 నిమిషాలు వీకే నరేష్‌పై నడిపించిన డ్రామా బాగా వర్కవుట్ అయింది. చివర్లో అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ట్విస్ట్ ఫీల్‌గుడ్‌గా ఉండటంతో సినిమా సంతృప్తికరంగా ముగుస్తుంది. సినిమాని చూడాల్సిందే.. చూడకపోతే.. కాస్ట్ లీ మిస్ అన్నట్టుగా చెప్పలేం కాని….. థియేటర్లలో వీలు కాకపోతే ఓటీటీలో అయినా ఓ సారి చూడొచ్చు.








