డల్లాస్‌లో ‘టీపాడ్’ బతుకమ్మ, దసరా వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా నవీన్ పోలిశెట్టి!
టెక్సాస్‌లోని ఫ్రిస్కో వేదికగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మరింత ఘనంగా, అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మనందరి ‘జాతిరత్నం’ నవీన్ పోలిశెట్టి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు.
వేడుకల తేదీ వివరాలు…
తేదీ: శనివారం, అక్టోబర్ 17, 2026
సమయం: మధ్యాహ్నం 12:00 నూన్ నుండి అర్ధరాత్రి 12 వరకు ఈ వేడుకలు నిరంతరం కొనసాగుతాయి.
వేదిక: కొమెరికా సెంటర్, 2601 ఎవెన్యూ ఆఫ్ ది స్టార్స్, ఫ్రిస్కో, TX 75024 (Comerica Center, Frisco, TX 75024)
కార్యక్రమ ప్రత్యేకతలు…
టాలీవుడ్ ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టి లైవ్ ఎంటర్టైన్మెంట్తో పాటు, ప్రముఖ యాంకర్ మృదుల తన మాటలతో, యాంకరింగ్‌తో మరింత ఉత్సాహపరచనున్నారు. ప్రముఖ ఇన్ఫ్యూషన్ బ్యాండ్(Infusion Band) అందించే హై-ఎనర్జీ మ్యూజిక్ బీట్స్ అందరినీ ఉర్రూతలూగించడంతో పాటు సాయంత్రం అంతా ఉత్సాహంగా నృత్యాలు చేసేలా అలరించనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఉచిత ప్రవేశం(FREE ENTRY), ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
అచ్చమైన తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, ఆటలు, సంగీతం, మరువలేని అద్భుతమైన వినోదంతో సాగే ఈ మహా సంబరాలకు ప్రవాస భారతీయులు, కుటుంబసమేతంగా, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.tpadus.org ను సందర్శించవచ్చు.








