రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ డల్లాస్ లో ‘‘సత్సంగ్’’
రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో ‘‘సండే సత్సంగ్’’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల ఆధ్యాత్మిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం కోసం దీనిని నిర్వహిస్తున్నారు. సత్సంగం అనేది మన భారతీయ ధర్మంలో అనాదిగా వస్తున్నదే.
సాధువులతో మరియు సత్యంతో నిరంతరం సహవాసం చేయడం వల్ల హృదయం శుద్ధి చెందుతుంది, ఆత్మ ఉన్నత స్థితికి చేరుకుంటుంది.” – స్వామి ముకుందానంద
భక్తిభావం, కీర్తనలు మరియు దివ్య జ్ఞానంతో కూడిన, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే ఈ ఆదివారం సత్సంగంలో మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ సత్సంగం ప్రారంభం అవుతుంది.
ప్రత్యక్ష దర్శనం (LIVE Darshan)
దివ్య కీర్తనలు (Blissful Kirtans)
ధ్యానం (Meditation)
స్వామీజీ ప్రవచనం (Swamiji’s Lecture)
హారతి (Aarti)
భక్తులు ఈ దివ్య కార్యక్రమంలో నేరుగా టెంపుల్కు వచ్చి ప్రత్యక్షంగా (In-person) హాజరుకావచ్చు. లేదా రాలేకపోయిన వారు యూట్యూబ్ (YouTube) లైవ్ ద్వారా మరియు భగవద్గీత కృష్ణ భక్తి యాప్ (Bhagavad Gita Krishna Bhakti App) ద్వారా ఇంట్లోనే ఉండి వీక్షించవచ్చు.







