తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కన్సాస్ సిటీ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కన్సాస్ సిటీ (TAGKC)ఆధ్వర్యంలో వైభవంగా దీపావళి వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా రుచికరమైన ఆహారం (Food), మనసును రంజింపజేసే నృత్యాలు (Dance), మరియు అలరించే సంగీతం (Music) వంటి విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వెలుగులు, ఆనందం, సంస్కృతి మరియు సామాజిక విందుతో కూడిన ఈ అద్భుతమైన సాయంద్రాన్ని అందరూ కలిసి ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
నవంబర్ 15 వ తేదీన మధ్యాహ్నం 1:00 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకూ ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతాయి. ఈ వేడుకలు బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూల్ (Blue Valley North High School), 12200 లామార్ ఏవ్, ఓవర్లాండ్ పార్క్, కేఎస్ 66209 వేదికగా జరుగుతాయి. FOOD, DANCE, MUSIC.. JION US FOR EVENING OF LIGHT, JOY, CULTURE AND COMMUNITY FEAST అన్న థీమ్ తో ఈ వేడుకలు జరగనున్నాయి. మరిన్ని వివరాల కోసం యమున (224) 249-9699, సరిత (913) 568-9932 నెంబర్లలో సంప్రదించవచ్చును. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు, మరింత చక్కగా చేయడానికి రిహారల్స్ కూడా ప్రారంభించారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 15
సమయం : మధ్యాహ్నం 1:00 గంటల నుంచి రాత్రి 8:30 వరకు
వేదిక : Blue Valley North High School), 12200 లామార్ ఏవ్, ఓవర్లాండ్ పార్క్, కేఎస్ 66209







