లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ ‘‘సంక్రాంతి మేళా’’ పోస్టర్ ఆవిష్కరణ.. ప్రత్యేక కార్యక్రమాలివే..
తెలుగు వారి పండగల్లో సంక్రాంతి పర్వదినానికి ఓ ప్రత్యేకత వుంది.అలాగే ఇది రైతులకు సంబంధించిన పండగ కూడా. ఎవరు ఎక్కడ వున్నా.. అందరూ తమ తమ గ్రామాలకు చేరుకొని, ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (LATA) వారు విదేశాలలో కూడా సంక్రాంతి పర్వదినాన్ని సమున్నతంగా చాటేలా ప్లాన్ చేశారు.
తెలుగు భాష – సమాజ సేవా – యువత భవిష్యత్తు” అనే నినాదంతో ముందుకు సాగుతున్న LATA సంస్థ, ప్రతిష్టాత్మకంగా ‘LATA సంక్రాంతి మేళా – 2027’ పోస్టర్ను విడుదల చేసింది. కనీసం రెండు నెలల ముందుగానే ఈ పోస్టర్ ను విడుదల చేసింది. దీని ద్వారా ముందుగానే డేట్ బుక్ చేసుకొని, అధిక సంఖ్యలో హాజరయ్యేందుకు వీలు వుంటుంది.
ఇవి కూడా చదవండి
‘LATA సంక్రాంతి మేళా – 2027’పేరుతో జరిగే ఈ కార్యక్రమం జనవరి 30 వ తేదీన జరగనుంది. వేదిక కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ మేళాలో ముగ్గులు, పిండి వంటల తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పతంగుల పండగ
ప్రత్యేక పండగ లంచ్ మరియు డిన్నర్
ఇండోర్ మరియు అవుట్డోర్ సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రత్యేక వెండర్ స్టాళ్లు
‘ట్రాష్ టు ట్రెజర్’ (Trash to Treasure) మరియు రీల్స్ (Reels) పోటీలు
ఈ వేడుకలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.latausa.org ను సందర్శించవచ్చు లేదా [email protected], (310) 400-0370 నంబర్లను సంప్రదించవచ్చు. తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని కోరుతున్నారు.







