గ్రేటర్ చికాగో హిందూ ఆలయంలో దీపావళి వేడుకలకు ఏర్పాట్లు
గ్రేటర్ చికాగో హిందూ ఆలయంలో (HTGC) లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 8 వ తేదీన దీపావళి వేడుకలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా గ్రేటర్ చికాకూ హిందూ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలివే…
ఉదయం 9:00 గంటలకు శ్రీ రామ సుప్రభాతం, ఆరాధన.
ఉదయం 10:00 గంటలకు శ్రీ మహాలక్ష్మి మూల మూర్తి అభిషేకం.
సాయంత్రం 6 గంటలకు శ్రీ మహాలక్ష్మీ ఊంజల్ సేవతో పాటు సహస్రనామ కుంకుమార్చన, స్వర్ణ పుష్పార్చన, అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం, దీపోత్సం, హారతి, ప్రసాద వితరణ వుంటుంది.
అలాగే ఈ దీపావళి సంబరాల సందర్భంగా దీపావళి బజార్ ను కూడా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఈఅ బజార్ అందుబాటులో వుంటుంది. అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు బాణాసంచా కూడా కాల్చనున్నారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్ షిప్ వివరాలివీ…
అన్ని ఈవెంట్లకు స్పాన్సర్షిప్: $101
అభిషేకం: $51
కుంకుమార్చన: $21
స్వర్ణ పుష్పార్చన: $21
ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం భక్తులు HTGC ఫ్రంట్డెస్క్ను 630-972-0300 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 8
సమయం : ఉదయం 9:00 గంటల నుంచి
వేదిక : గ్రేటర్ చికాగో హిందూ ఆలయం
ప్రత్యేక ఆకర్షణలివీ …
శ్రీ రామ సుప్రభాతం, ఆరాధన
శ్రీ మహాలక్ష్మి మూల మూర్తి అభిషేకం
దీపావళి బజార్
సాంస్కృతిక ప్రదర్శనలు








