టెంపా బే తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా దీపావళి వేడుకలు
టెంపా బే తెలుగు అసోసియేషన్ (Telugu Association of Florida, Tampa Bay) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ‘దసరా-దీపావళి’ వేడుకలను నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నవంబర్ 7 న ఈ వేడుకలు ఇండియా కల్చరల్ సెంటర్, టెంపా (India Cultural Center, Tampa) వేదికగా అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.సాయంత్రం 4:00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి.
అయితే.. ప్రవేశం అందరికీ ఉచితమని, అంతేకాకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి దీపావళి స్వీట్లు కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, మ్యూజికల్ ఈవెంట్స్, స్వరావధానంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రవాస ఆంధ్రులు, తెలుగు కుటుంబాలన్నీ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొని, పండుగ ఆనందాన్ని పంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి రండి, ఈ వేడుకలను విజయవంతం చేయండి.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 7
సమయం : సాయంత్రం 4:00 గంటల నుంచి
వేదిక : india cultural centre, tampa
ప్రత్యేక ఆకర్షణలు
ప్రవేశం అందరికీ ఉచితం
ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దీపావళి స్వీట్స్ గిఫ్ట్
సంప్రదాయ నృత్య ప్రదర్శనలు
మ్యూజికల్ ఈవెంట్స్
స్వరావధానం








