‘రణబాలి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: ఓవర్ సీస్ పరిస్ధితి ఏమిటి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి సినిమా మిక్సెడ్ రివ్యూలతో ఈ వారం దసరా కానుకగా మన ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగటంతో భాక్సాపీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
ఈ నేపధ్యంలో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్ల గ్రాస్ వసూళ్లతో ముగించింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తొలి మూడు రోజులు పర్వాలేదనిపించే వసూళ్లను సాధించింది. ఓపెనింగ్ వీకెండ్‌తోనే సినిమా పెట్టుబడిలో దాదాపు 50 శాతం రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది?
ఏరియా గ్రాస్ వసూల్లు
ఇండియా రూ.27 కోట్లు
ఓవర్సీస్ రూ.9 కోట్లు
వరల్డ్‌వైడ్ రూ.36 కోట్లు
ఇండియాలో రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఓవర్సీస్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. విదేశీ మార్కెట్లలో వచ్చిన వసూళ్లు అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో అక్కడ నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ విశ్లేషణలు సూచిస్తున్నాయి.
రూ.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. రణబాలి చేరుకుంటుందా?
రణబాలి థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ.75 కోట్ల గ్రాస్‌గా ఉంది. తొలి వీకెండ్లో రూ.36 కోట్ల వసూళ్లు సాధించడంతో లక్ష్యంలో దాదాపు సగం పూర్తయింది. అయితే, ఈ వసూళ్లను బట్టి సినిమా లాభాల్లోకి వచ్చేసిందని చెప్పలేం. ఇంకా గణనీయమైన వసూళ్లు సాధించాల్సి ఉంది.
ఇండియా మార్కెట్లో సినిమా కొంత మెరుగైన నిలకడను చూపిస్తుండటంతో అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ మిక్స్డ్ టాక్ నేపథ్యంలో సోమవారం నుంచి వచ్చే వసూళ్లు కీలకం కానున్నాయి.
దసరా సెలవులు కలిసొస్తాయా?
రణబాలి సినిమాకు ఇప్పుడు దసరా పండుగ సెలవులపై ఆశలు పెరిగాయి. వారాంతం తర్వాత వచ్చే పండుగ సెలవులు, ఆపై రెండో వీకెండ్ వసూళ్లు సినిమాకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే, పండుగ సెలవులు ఉన్నంత మాత్రాన కలెక్షన్లు పెరుగుతాయని చెప్పలేం. ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో ఆక్యుపెన్సీ, రోజువారీ వసూళ్లలో నిలకడ వంటి అంశాలే సినిమా తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
.








