తెలుగు రాష్ట్రాల్లో జైలర్2 జోరు.. లాభాల బాటలో డిస్ట్రిబ్యూటర్లు!
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన జై లర్2(Jailer2) బాక్సాఫీస్ వద్ద క్రమంగా పుంజుకుంటూ కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఓ మోస్తరు ఆరంభాన్ని అందుకుంది. అయితే, శుక్రవారం నుంచి కలెక్షన్లలో గ్రోత్ కనిపించగా శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో మరింత మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. వీకెండ్లో సినిమాకు లభిస్తున్న ఆదరణ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఫస్ట్ డే కంటే శనివారం కలెక్షన్లు గణనీయంగా పెరగడం ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీకి సానుకూల సంకేతంగా మారింది.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత నాగవంశీ(naga vamsi) జీఎస్టీతో కలిపి రూ.52 కోట్లకు సొంతం చేసుకున్నారు. ప్రస్తుత కలెక్షన్ల ధోరణి ఇలాగే కంటిన్యూ అయితే, ఫస్ట్ వీక్ లోనే డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడులను రాబట్టుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నాగవంశీకి కూడా మంచి లాభాలు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్(Sun Pictures) సంస్థకు సైతం బాక్సాఫీస్ ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, నెల్సన్ తెరకెక్కించిన విధానం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. రమ్యకృష్ణ(Ramya krishna), మీర్నా(Mirna) తమ గత పాత్రల్లోనే కనిపించగా, మోహన్‌లాల్(mohan lal), శివరాజ్‌కుమార్(Sivaraj kumar), జాకీ ష్రాఫ్(Jocket shroff), హృతిక్ రోషన్(Hrithik roshan) గెస్ట్ రోల్స్ లో సందడి చేశారు. స్టార్ నటీనటుల కలయిక ఆడియన్స్ లో ఆసక్తిని పెంచగా, వీకెండ్ కలెక్షన్లు సినిమాకు మరింత ఊపునిచ్చాయి. రానున్న రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే జైలర్2 కమర్షియల్ గా మరింత స్ట్రాంగ్ సక్సెస్ ను అందుకునే అవకాశముంది.








