IITH తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్న అమెరికా తెలుగు సంఘం
అమెరికా తెలుగు సంఘం (ATA – ఆటా) ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)లో ఇంజనీరింగ్ విభాగంలో 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో కలసి పనిచేయడం పట్ల ఆటా హర్షం వ్యక్తం చేసింది.
ఒప్పందం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటే…
స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్: అమెరికా విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లోని సమ్మర్ క్లాసెస్, సెమిస్టర్ నార్మల్ కోర్సులు లేదా షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరే వెసులుబాటు లభిస్తుంది. ఐఐటీహెచ్‌లో టాప్-రేటెడ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఏఐ (AI), సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌లలో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి.
1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్’లో పరిశోధన ప్రాజెక్టులు (Research Projects) చేపడుతారు.
ఇప్పటికే 320కి పైగా స్టార్టప్‌లు, రూ. 1500 కోట్ల పెట్టుబడులతో బలమైన స్టార్టప్ ఆవరణ వ్యవస్థను (Ecosystem) కలిగి ఉన్న ఐఐటీహెచ్‌లోని స్టార్టప్‌లకు మెంటార్షిప్ అందించడంతో పాటు, Entrepreneurs మరియు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశం.
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులను అమెరికా మరియు భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌లుగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబడుతుంది.
ఈ భాగస్వామ్యంలో అమెరికా తెలుగు సంఘం (ATA) కోఆర్డినేషన్ మరియు లాజిస్టిక్స్ బాధ్యతలను చూసుకుంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tinyurl.com/ATA-IITH-SEP లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమం ATA ఎడ్యుకేషన్ కమిటీ సుశీల్ చంద్ర (చైర్) (615)448-5003, రవి లోతుమల్ల (కో చైర్) (917)670-2021, సతీష్ యెల్లమిల్లి (కో చైర్), (630)865-7765, అలాగే ఫణీంద్ర రెడ్డి కాసు, నరేష్ తాళ్లూరు, శైలేంద్ర వూట్ల, కల్యాణ్ కొండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే జయంత్ చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్ ఎలెక్ట్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది.








