TAGB వేదికపై కాన్సులర్ సేవలు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం ఓ బృహత్తర బాధ్యతను చేపట్టింది. దసరా/ దీపావళి వేడుకల సందర్భంగా కాన్సులర్ సేవలపై తగిన మార్గదర్శనం చేయిస్తోంది. కాన్సులర్ సేవల్లో ఏవైనా ఇబ్బందులు వున్నా, ఇతరత్రా అంశాలను నివృత్తి చేయడానికి, మార్గదర్శనం చేయడానికి రెడీ అవుతోంది. ఇందుకు గాను ‘‘వీసా ఫెసిలిటేషన్ సంస్థ వారితో తగిన మార్గదర్శనం చేయిస్తుంది.
అక్టోబర్ 17 వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి లిటిల్టన్ హైస్కూల్ – 56 కింగ్ స్ట్రీట్, లిటిల్టన్, MA లో జరగనుంది. ఎవరికైనా కాన్సులర్ సేవలు అవసరమైన వారు ఈ సౌలభ్యాన్ని చక్కగా వినియోగించుకోవాలని బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం కోరుతోంది.








