విమాన ప్రయాణానికి ముందు ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్‌ను బ్యాగులో పెట్టుకుంటున్నారా? అయితే ఒక్కసారి దాని మోడల్ నంబర్‌ను చెక్ చేసుకోండి!
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ మంటల ఘటన నేపథ్యంలో, భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఒక నిర్దిష్ట మోడల్‌పై నిషేధం విధించింది.
డీజీసీఏ తాజా నిషేధం
ప్రయాణికులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. MOBIKINS MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌ను భారత్‌లో నడిచే విమానాల్లో తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధముంది.
నిషేధించబడిన మోడల్ ఇదే
డీజీసీఏ అన్ని రకాల పవర్ బ్యాంకులపై నిషేధం విధించలేదు. కేవలం 'మోబికిన్స్' (MOBIKINS) MK-PB-04 మోడల్‌పై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.
అన్ని పవర్ బ్యాంకులపై కాదండోయ్!
మీరు విమానం ఎక్కే ముందు మీ పవర్ బ్యాంక్‌పై ఉన్న బ్రాండ్ మరియు మోడల్ నంబర్‌ను పరిశీలించండి. ఈ మోడల్ మీ వద్ద ఉంటే పొరపాటున కూడా విమానంలోకి తీసుకెళ్లవద్దు.
ప్రయాణానికి ముందే చెక్ చేసుకోండి
నిబంధనల ప్రకారం పవర్ బ్యాంకులు, విడిగా ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలను తనిఖీ లగేజీలో కాకుండా ఎప్పుడూ హ్యాండ్ బ్యాగేజీలోనే ఉంచుకోవాలి.
హ్యాండ్ బ్యాగేజీలోనే ఉంచాలి
విమాన ప్రయాణ సమయంలో పవర్ బ్యాంక్‌తో మొబైల్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడంపై నిబంధనల ప్రకారం ఆంక్షలు ఉన్నాయి.
ఛార్జింగ్ చేయడానికి ఆంక్షలు
విమానంలోని సీటు వద్ద ఉండే పవర్ అవుట్‌లెట్‌ను ఉపయోగించి మీ పవర్ బ్యాంక్‌ను నేరుగా ఛార్జ్ చేయడానికి కూడా అనుమతి లేదు.
విమానంలో ఛార్జింగ్ కుదరదు
ప్రయాణ సమయంలో మీ పరికరం అసాధారణంగా వేడెక్కినా, పొగ వచ్చినా లేదా వింత వాసనొచ్చినా వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించాలి.
బ్యాటరీ వేడెక్కితే వెంటనే చెప్పండి
చిన్న పొరపాటు విమాన భద్రతకు ముప్పు తెస్తుంది! ప్రయాణానికి ముందు మీ లగేజీని, పవర్ బ్యాంక్ మోడల్‌ను తనిఖీ చేసుకుని సురక్షితమైన ప్రయాణాన్ని సొంతం చేసుకోండి.