మాస్ అవతార్‌లో సాయిదుర్గా తేజ్.. సంబరాల ఏటిగట్టుపై పెరుగుతున్న అంచనాలు!
మెగా హీరో సాయిదుర్గా తేజ్(Sai durga tej) తన తర్వాతి ఇనిమా సంబరాల ఏటిగట్టు(Sambarala yetigattu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విప్లవాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎపిక్‌లో భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ లుక్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. వెనుకవైపు గూడ్స్ ట్రైన్, చేతిలో కత్తితో కనిపిస్తున్న తేజ్.. ప్రత్యర్థులపై తిరుగుబాటుకు సిద్ధమైన యోధుడిలా ఆకట్టుకుంటున్నారు. పోస్టర్‌లోని మాస్ అప్పీల్‌తో పాటు యాక్షన్ నేపథ్యం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
చైతన్య రెడ్డి(chaitanya reddy), నిరంజన్ రెడ్డి(niranjan reddy) నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు రోహిత్ కేపీ(Rohit kepi) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. కాంతార(kantara) సినిమాతో తన మ్యూజిక్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh Lokanath) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ యాక్షన్, విభిన్నమైన కథాంశంతో సంబరాల ఏటిగట్టు తేజ్‌కు ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.








