శాన్ ఆంటోనియోలో ‘టాసా’ ఆధ్వర్యంలో కోటి 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి స్వర నీరాజనం!
టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియో నగరంలో శాన్ ఆంటోనియో తెలుగు సంఘం(TASA – Telugu Association of San Antonio) ఆధ్వర్యంలో ఈ ఏడాది దసరా, దీపావళి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రవాస తెలుగు సమాజం మొత్తం కుటుంబసమేతంగా కలిసి పండుగ ఆనందాన్ని పంచుకునేలా ఈ మహా వేడుకలను ప్లాన్ చేశారు. ఈ సంవత్సరం సంబరాలు మరింత ప్రత్యేకం కానున్నాయి. టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కోటి 50 ఏళ్ల అపూర్వ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ వేదికపై ఆయనను ఘనంగా సత్కరించనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కోటి & బృందం లైవ్ కన్సర్ట్…
ఈ వేడుకల్లో భాగంగా సంగీత ప్రియులను అలరించేందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి , వారి ప్రముఖ సింగర్స్ బృందం సమక్షంలో మరపురాని లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ జరగనుంది. సినీ అభిమానులను ఉర్రూతలూగించే పాటలతో వేదిక హోరెత్తనుంది.
వేడుకల వివరాలు:
తేదీ: నవంబర్ 1, 2026 (ఆదివారం)
వేదిక: ష్రైన్ ఆడిటోరియం (Shrine Auditorium)
చిరునామా: 901 ఎన్ లూప్ 1604 డబ్ల్యూ, శాన్ ఆంటోనియో, TX 78232
ఈ వేడుకలకు సంబంధించిన టికెట్ల కోసం ఎర్లీ బర్డ్ రాయితీ అక్టోబర్ 26, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
ఎర్లీ బర్డ్ ధరలు (అక్టోబర్ 26 వరకు): సభ్యులకు (Members) $20, నాన్-మెంబర్లకు $25, పిల్లలకు $15.
సాధారణ ధరలు (Regular Price): సభ్యులకు $25, నాన్-మెంబర్లకు $30, పిల్లలకు $15.
జెల్లే (Zelle) ద్వారా పేమెంట్ చేయడానికి: [email protected] ఉపయోగించవచ్చు.
టికెట్ల కొనుగోలుకు అధికారిక లింక్: http://bit.ly/tasa26koti లేదా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు.
స్పాన్సర్షిప్ వివరాలు…
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పాటునందించే దాతల కోసం పలు స్పాన్సర్షిప్ కేటగిరీలను అందుబాటులో ఉంచారు:
గ్రాండ్ స్పాన్సర్ (Grand Sponsor): $5,000
ప్లాటినం స్పాన్సర్ (Platinum Sponsor): $2,500
గోల్డ్ స్పాన్సర్ (Gold Sponsor): $1,000
సిల్వర్ స్పాన్సర్ (Silver Sponsor): $500
బ్రాంజ్ స్పాన్సర్ (Bronze Sponsor): $250
మంచి సంగీతం, సాంస్కృతిక వైభవం, పండుగ సందడి, వినోదంతో సాగే ఈ సాయంత్రంలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా , స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున తరలిరావాలని టాసా ప్రతినిధులు పిలుపునిచ్చారు. స్పాన్సర్షిప్ , వెండర్ స్టాళ్ల వివరాల కోసం టాసా ప్రెసిడెంట్ ఆది నారాయణ (919-916-0919), ప్రెసిడెంట్-ఎలెక్ట్ నీరజ సుంకర (210-827-1881) లను సంప్రదించవచ్చు.








