‘‘భాన్జు’’ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు ’’మేథమెటిక్స్ క్విజ్’’
సహజంగానే చిన్న పిల్లలకు మేథమెటిక్స్ అంటే చాలా భయం వుంటుంది. ఎక్కువ శాతం ఈ సబ్జెక్టులోనే మార్కులు కూడా తక్కువగా వస్తుంటాయి. దీంతో తల్లిదండ్రులు కూడా నానా హైరానా పడుతుంటారు. పిల్లలు కూడా దిగాలు పడిపోతుంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి వివిధ సంస్థలు, తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ ప్రయత్నంలో భాగంగానే ‘‘భాన్జు’’ సంస్థ ఓ అద్భుతమైన మేధో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలల కోసం ‘ది భాన్జు మ్యాథ్ ఛాలెంజ్’ పేరుతో ఓ ఉత్సాహ భరితమైన గణిత పోటీ నిర్వహించనుంది. ‘‘The Bhanzu MATH CHALLANGE a fun math competition fot young learners పేరుతో జరిగే ఈ క్విజ్ నవంబర్ 22 వ తేదీన జరగనుంది. సాయంత్రం 4:00 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో 8th class వరకు చదువుతున్న వారికి మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం వుంటుంది. ఇందులో గెలుపొందిన ముగ్గురు విద్యార్థులకు మంచి బహుమతి కూడా లభిస్తుంది.
ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాకుండా, పిల్లలలో గణితంపై ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభినందించే చక్కటి అవకాశం.ఈ పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదు, పూర్తిగా ఉచితంగా వుంటుంది.
చిన్నారులు చురుగ్గా ఆలోచించేలా (Think Fast), తెలివైన మార్గాల్లో సమస్యలను సాధించేలా (Solve Smart) ఈ పోటీని రూపుదిద్దారు. ఆసక్తి గల విద్యార్థులు పోస్టర్లో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ (QR Code) ను స్కాన్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.







