వంట పూర్తయ్యే వరకు వేచి చూడకుండా మధ్యలోనే చిందిన పదార్థాలు, మరకలను శుభ్రం చేస్తే కిచెన్‌లో గందరగోళం తగ్గుతుంది.
వంట చేస్తూనే శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి
కూరగాయలు కోసిన తర్వాత, వంట పూర్తయ్యాక కౌంటర్‌ను శుభ్రం చేయడం వల్ల మరకలు, బ్యాక్టీరియా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
కిచెన్ కౌంటర్‌ను ఎప్పుడూ తుడవండి
పాత్రలు పేరుకుపోకుండా సింక్‌ను ఖాళీ చేసి శుభ్రం చేయడం మంచిది. పొడి సింక్ దుర్వాసనలు, కీటకాల సమస్యలను తగ్గిస్తుంది.
సింక్‌ను రాత్రంతా మురికిగా ఉంచొద్దు
మసాలా డబ్బాలు, పాత్రలు, వంట వస్తువులను ఉపయోగించిన తర్వాత వాటి స్థానంలో పెట్టడం వల్ల కిచెన్ ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది.
ప్రతి వస్తువుకు ప్రత్యేక స్థానం ఇవ్వండి
ముడి, వండిన ఆహారాలను వేర్వేరుగా ఉంచాలి. ఆహారాన్ని మూతపెట్టి నిల్వ చేయడం పరిశుభ్రతకు ఎంతో ముఖ్యం.
కూరగాయలు, ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయండి
కిచెన్ వ్యర్థాలను ఎక్కువసేపు ఉంచకుండా రోజూ బయట వేయాలి. ఇది దుర్వాసన, చీమలు, బొద్దింకల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చెత్త బుట్టను రోజూ శుభ్రం చేయండి