రివ్యూ : ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ దృశ్యపరంగా మా కవర్ స్టొరీ సక్సెస్ అయినట్లే
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.75/5
నిర్మాణ సంస్థలు : ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీడియోల్, అమితాబ్ బచ్చన్,
కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు
సినిమాటోగ్రఫి: పంకజ్ కుమార్, మహేష్ లిమయే,
సంగీతం : హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్, ఎడిటింగ్: హుజేఫా లోకండ్వాలా,
మాటలు : శ్రేయాస్ జైన్, నితేష్ తివారీ, స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
నిర్మాతలు: నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్క్
దర్శకత్వం: నితీష్ తివారీ
విడుదల తేది : 05.10.2016
పార్ట్ 1 నిడివి : 3 ఘంటల 15 నిముషాలు
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) ఎట్టకేలకు ఈ రోజు (నవంబరు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘రామాయణం’. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్,2డీ, 3డీ, IMAX ఫార్మాట్లలో ఉన్నత ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం ధియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ప్రశంసలు అందుకుంటోంది. శ్రీరాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ ప్రశాంతత, దివ్యత్వం ఉట్టిపడే నటనతో మెప్పించగా, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెరపై ఆధిపత్యం చూపించారు. సీతగా సాయిపల్లవి భావోద్వేగాలను పండించారు. వాల్మీకి రామాయణాన్ని నేటి ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా మలిచిన ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన వంటి దిగ్గజ తారాగణంతో భారతీయ పలు భాషల్లో రూపొందిన ఈ చిత్రం కుటుంబ భావోద్వేగ సన్నివేశాల్లో కథనం కాస్త నెమ్మదించినా, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ‘జటాయు – రావణ’ పోరాట ఘట్టం భారతీయ సినిమా చరిత్ర లో సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. వెండితెరపై ఇదివరకెన్నడూ రానటువంటి అద్భుత విజువల్ వండర్‌గా ప్రేక్షకులు దీనికి జైకొడుతున్నారు.
ఇవి కూడా చదవండి
కథ :
రామాయణ కథ తెలియని వారు ఎవరున్నారు చెప్పండి? భారతీయ సంస్కృతిలో రామాయణానికి ఉన్న స్థానం అపారమైనది. శ్రీరాముడి ఆదర్శ జీవితం, సీతాదేవి సహనం, లక్ష్మణుడి సోదర ప్రేమ, హనుమంతుడి భక్తి, రావణుడి అహంకారం.. ఇలా ప్రతి పాత్రా తరతరాలుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే రామాయణం కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయ కళలు, సాహిత్యం, రంగస్థలం, సంగీతం, సినిమాలకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తోంది. శ్రీరామ కథపై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రామాయణం పార్ట్ 1 లో అసురుల మహారాణి రావణుడి తల్లీ, కైకసి దేవతల రాజు అయిన ఇంద్రుడుతో, యుద్ధం చేయడం ఆమె ఓడిపోవడం కుబేరుడికి లంకా నగరాన్ని ఎలడం వంటి ఘట్టాలతో సినిమా కథ ప్రారంభమౌతుంది.
రామాయణ పార్ట్-1లో నేరుగా శ్రీరాముడు, రావణాసురుని మధ్య జరిగే మహా సంగ్రామానికి వెళ్లకుండా, పాత్రల స్వభావం, భావోద్వేగాలు, కథా పునాదిని బలంగా స్థాపించడంపై డైరెక్టర్ దృష్టి పెట్టారు. అయోధ్య రాజకుమారుడిగా శ్రీరాముడి పుట్టుక, ప్రారంభ జీవితం, విశ్వామిత్రునితో ప్రయాణం, మిథిలా నగరంలో శివధనస్సును ఎత్తి సీతాదేవిని పరిణయమాడటం, శ్రీ రాముడి పట్టాభిషేకం ముందు కైకేయి కోరిన వరాల వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి సిద్ధపడటం, ఆయనను అనుసరిస్తూ సీతాదేవి, లక్ష్మణుడు అడవికి పయనం కావడం, అక్కడ రాక్షస సంహారం తో శూర్పణఖ ఘట్టం, మారీచుని స్వర్ణ లేడి ఉదంతం, రావణాసురుడు సీతను అపహరించే కీలక సన్నివేశాలలలో జటాయువు రావణుడి ఆకాశ యుద్ధం, చివరగా రావణుడిని హతమార్చి ధర్మాన్ని కాపాడుతానని రాముడు ప్రతిజ్ఞ చేయడం, చివర్లో టైటిల్స్ వచ్చేముందు హనుమాన్ చాలీసా ఆడియో తో హనుమంతుడు(సన్నీ డియోల్) పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ సముద్రాన్ని దాటే క్రమంలో పార్ట్ 1 ముగించారు.
నటీ నటుల హావభావాలు :
నటీనటులు ఎలా నటించారంటే? ఈ సినిమాలో నటీనటుల ఎంపిక అతిపెద్ద ప్లస్ పాయింట్. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ అత్యంత వినయం, ధర్మబద్ధత, శాంత స్వరూపాన్ని అద్భుతంగా పండించారు. శ్రీరాముడిని అనవసరమైన ఆవేశంతో చూపించకుండా పాత్రలోని ప్రశాంతతను, ఆంతరంగిక శక్తిని ఎంతో హుందాగా ఆవిష్కరిచారు. సీతాదేవిగా సాయి పల్లవి తన సహజ నటన, రాజసం, ఆత్మస్థైర్యంతో మెప్పించారు. ఇక రావణాసురుడిగా నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, గాంభీర్యం, నటనలోని తీవ్రత సినిమాకు సరికొత్త గంభీరతను తెచ్చి పెట్టాయి. లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్, శూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్, కైకసి గా శోభనా, కైకేయి గా లారా దత్త, తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీ నటులు తమ పాత్రలమేరకు నటించారు.
సాంకేతిక వర్గం పంతీరు:
రామాయణం కథలను ఇప్పటి వరకు ఎన్నో వెర్షన్లు చూసి ఉంటాం. నితీష్ తివారీ రామాయణం డెఫినెట్‌గా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. తెలుగు తెర మీద, ఇతర భాషల్లో రూపొందిన రామాయణంలో చూపించని ఎన్నో అంశాలు కొత్తగా ఉన్నాయి. నితీష్ వర్క్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా భావోద్వేగ, ప్రముఖ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌స్కోర్ అద్భుతంగా కుదిరింది. ప్రపంచ ప్రసిద్ధ వీఎఫ్ఎక్స్ సంస్థ ‘DNEG’ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ భారతీయ సినిమాలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించినప్పటికీ.. క్లైమాక్స్ సన్నివేశాలు ఆ లోపాన్ని పూర్తిగా సరిదిద్దాయి. అయితే కొన్నిచోట్ల తెలుగు మాట్లాడేటపుడు లిప్-సింక్ సరిగ్గా కుదరలేదనే సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒరిజినల్ హిందీ కదా?
పంకజ్ కుమార్, మహేష్ లిమయే సినిమాటోగ్రఫీతో పాటు అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్, 3డీ ఎఫెక్ట్స్ దృశ్యాలను అద్భుతంగా వున్నాయి.మనకు తెలిసిన కథ అయినా దర్శకుడు నితేశ్ తివారీ స్క్రీన్ ప్లే, కథనం అధ్బుతంగా రాసుకున్నాడు. పర్ణశాల వద్ద రావణుడు లక్ష్మణ రేఖ ను దాటలేక, సీతమ్మ తనంతట తానూ బయటికి ఎలా రాప్పించాలో లాజిక్ మిస్ అవ్వకుండా…. శూర్పణఖ రాముడిని ఎందుకు ఇష్టపడిందో వంటి లాజిక్స్ వెతుకుకోకుండా కొత్తగా చూపించాడు. తెలుగులో ఆకెళ్ల రాసిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి. ఎమోషనల్ సీన్లలో ఆయన సంభాషణలు బలంగా వినిపించాయి. ఇక నిర్మాణపు విలువల గురించి వేరే చెప్పాలా? హాలీవుడ్ రేంజ్ లో మనము చేయగలము అనే విధంగా వున్నాయి. నమిత్ మల్హోత్రా అనుసరించిన నిర్మాణ విలువలు ఈ సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందించాలనే విజన్‌కు అద్దం పట్టింది.
విశ్లేషణ:
రామాయణం భారతీయ పౌరాణిక చిత్ర నిర్మాణాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన సినిమా అనుభవం. ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీ. మంచి అనుభూతిని పొందాలనుకొనే వారు తప్పకుండా చూడాలని సలహా ఇస్తున్నాం. మీ పిల్లలను తీసుకురండి, వారికి మన పురాణాలను, సంప్రదాయాలను గర్వంగా పరిచయం చేయండి మరియు సాధ్యమైనంత పెద్ద తెరపై ఈ ఇతిహాసాన్ని అనుభవించండి. వెండితెరపై ఆవిష్కృతమైన ఓ విజువల్ వండర్. శ్రీరాముడు, రావణాసురుని మధ్య రాబోయే మహా యుద్ధానికి ఇది బలమైన పునాది వేసింది. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్, నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన, ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే. హనుమంతుడి రాక, రావణుడిపై రాముడి యుద్థం లాంటి భారీ ఎపిసోడ్లు పార్ట్- 2లో చూడొచ్చనే హింట్ అయితే ఇచ్చేశారు.







